వలసలకు బ్రేకులు ? బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యిందిగా ?  

Chandrababu Plan Migrants Rajya Sabha - Telugu Ap Govt, Chandrababu, Mahanadu, Rajya Sabha Elections, Tdp, Tdp Mla\\'s, Ysrcp

ఒక వైపు కరోనా, మరోవైపు వలస వెళ్లాలనుకునే నాయకుల బెదిరింపులతో కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పైకి తన బాధ ఏంటనేది చంద్రబాబు చెప్పకపోయినా, ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నియోజకవర్గ స్థాయి కీలక నేతలు, అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారనే సమాచారంతో చంద్రబాబు చాలా ఆవేదనలో ఉండిపోయారు.

 Chandrababu Plan Migrants Rajya Sabha

పార్టీ కష్టకాలంలో వీరంతా వెళ్ళిపోతే, పార్టీ మరింత దెబ్బతింటుందని చంద్రబాబు ఆవేదనఉండిపోయారు.మహానాడుకు ముందే పెద్ద ఎత్తున టిడిపి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని చంద్రబాబుకీ గట్టి ఝలక్ ఇవ్వాలని వైసీపీ ప్లాన్ చేసుకుంది.

ఈ విషయాన్ని పసిగట్టే చంద్రబాబు వ్యూహాత్మకంగా వలస వెళ్లాలనుకునే నాయకులందరినీ గుర్తించి వారి అసంతృప్తిక కారణాలను తెలుసుకుని, పార్టీ కీలక నాయకులతో రాయబారాలు పంపి తాత్కాలికంగా బ్రేకులు వేయగలిగారు.

వలసలకు బ్రేకులు బాబు ప్లాన్ వర్కవుట్ అయ్యిందిగా -Political-Telugu Tollywood Photo Image

వారందరికీ భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు చేయడం, మహానాడు తర్వాత కూడా వారందరి పైన దృష్టి పెట్టి వారు పదే పదే వారితో చర్చలు జరిపి తమ వ్యూహాలను అమలు చేశారు.

దీంతో వలస వెళ్లాలనుకున్న నాయకులంతా ఆలోచనలో పడ్డారు.ఒకవైపు వైసీపీ నుంచి ఒత్తిడి వస్తున్నా, వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు.ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైతే, ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది అనేది చంద్రబాబు అసలు భయానికి కారణం.అందుకే అంతగా వారిపై దృష్టిపెట్టారు.

తాత్కాలికంగా ఈ విషయంలో బాబు సక్సెస్ అయ్యారు.కానీ రాజ్యసభ ఎన్నికలు ఈ నెల 18వ తేదీన ఉండడంతో వారంతా ఓటింగ్ లో పాల్గొంటారు అనే దానిపైనే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందా లేదా అనేది తేలిపోనుంది.

చంద్రబాబు మాత్రం తాత్కాలికంగా అయినా వలసలకు బ్రేక్ వేసి, ఎవరు వైసీపీలో చేరకుండా చేయగలిగామనే సంతోషంలో ఉన్నారు.ఇప్పటికే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, విశాఖ జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు , నియోజకవర్గ స్థాయి నాయకులు ఇప్పటికే వైసీపీ గూటికి వెళ్లాల్సి ఉన్నా చంద్రబాబు ముందుచూపుతో వారు తమ నిర్ణయం పై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test