ముందస్తు కోసం చంద్రబాబు వ్యూహం సిద్దం..       2018-06-26   02:15:04  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకి ముందస్తు ప్రణాళికలని ఇప్పటినుంచీ రూపొందిస్తున్నారు..కేంద్రం నుంచీ రాష్ట్రాలకి ముందస్తు ఎన్నికల గురించి అందిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి నిశ్చయించుకున్న బాబు ఆదిసగా పార్టీని పార్టీలోని కేడర్ మొత్తాన్ని కార్యకర్తలని సమాయుత్తం చేస్తున్నారు..అందులో భాగంగా చంద్రబాబు జిల్లాలవారీగా పర్యటనలని చేస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా చంద్రబాబు వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏ నిమిషం అయినా రావచ్చు కాబట్టి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

అయితే వరుసగా నాయకులతో భేటీ అయిన చంద్రబాబు కార్యకర్తలే పార్టీ కి వెన్నెముక వారిబాగోగులు చూసుకోండి అంటూ హితబోడ చేశారు..వారికి కూడా పార్టీ లో సముచిత స్థానం ఇవ్వాలని గౌరవం పంచాలని తెలిపారు..ఏ కార్యకర్త అయినా సరే అవమానం పొందాడు అంటే క్షమించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట..ముఖ్యంగా కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారో వాటిని ప్రతి ఒక సామాన్యుడికి తెలియజెప్పేలా కార్యకర్తలు నాయకులు ఉండాలని ఈ సందర్భంగా అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ గత నాలుగేళ్లలో కర్నూల్ జిల్లాని ఎన్నడూ చేయనంత అభివృద్ధి చేసాము అని అది బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందని చెప్పారట మనం చేసిన అభివృద్ధిని ప్రజలకి చెప్పుకోలేకపోతే రాజకీయాలు చేయటం అనవసరం అని ఘాటుగా స్పందించారు బాబు. ముఖ్యంగా జిల్లాకి చేసిన పనుల గురించి ఉటంకిస్తూ రాయలసీమకు ప్రాణనాడి మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని రూ.237కోట్లతో పూర్తిచేశాం.కెసి కెనాల్ పరిధిలో 35వేల ఎకరాలు, పందికోన జలాశయం కింద 65వేల ఎకరాలకు సాగునీటి సదుపాయం ఏర్పడింది.హంద్రీ-నీవా ఫేజ్-1 పనులు 93%,ఫేజ్ 2పనులు 78% పూర్తయ్యాయి.గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తిచేశాం. పులికనుమ, పులికుర్తి, గోరుకల్లు పూర్తిచేశామని ఇవన్నీ ఇక్కడి ప్రజలకి ప్రతీ విషయం తెలిసేలా చేయాలని అన్నారట..అయితే

ఎన్నో ఇబ్బందులు ఎదురయినా సరే ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడినా సరే రూ.479కోట్లతో గండికోట రిజర్వాయర్ పూర్తి చేశాం…అడవిపల్లి…చెర్లోపల్లి రిజర్వాయర్లు పూర్తిచేస్తున్నాం.ప్రపంచంలోనే అతిపెద్దదైన 1000మె.వా సోలర్ పార్క్ రూ.7వేల కోట్లతో నెలకొల్పాం.ఓర్వకల్ లో మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ది చేస్తున్నాం.గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఓర్వకల్ లో వస్తోంది.ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్,టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని..అంతేకాక..జిల్లాలో ట్రిపుల్ ఐటి..ఉర్దూ విశ్వవిద్యాలయం వచ్చాయి…ఎడ్యుకేషన్ హబ్ గా కర్నూలును రూపొందిస్తున్నాం అని ఆయన అన్నారు..ఈ విషయాలు ముఖ్యంగా ప్రజలు అందరికీ తెలిసేలా చేయవలసిన భాద్యత కార్యకర్తలది తరువాత నాయకులది అన్నారట..అంతేకాదు కార్యకర్తలకి నేతల వలన ఇబ్బందులు ఎదురయితే నేరుగా వచ్చి నన్ను కలవండి అంటూ కార్యకర్తలలో అనూతన ఉత్తేజమ నింపారట చంద్రబాబు..ఇదే తరహా కార్యక్రమాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా జరిగిన అభివృద్దిని చాటి చెప్పేలా మరిన్ని వ్యుహాలని రచిస్తున్నారట చంద్రబాబు..