ఏపీలో పొత్తుల వ్యవహారం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ), జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు రేపు హస్తిన బాట పట్టనున్నారని సమాచారం.
ఇందులో భాగంగా బీజేపీ హైకమాండ్ తో పొత్తుల వ్యవహారంపై ఇరు నేతలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే రేపు ఎన్డీయేలో టీడీపీ చేరనుందని సమాచారం.మరోవైపు పొత్తులపై ఇప్పటికే రాష్ట్ర నాయకులతో బీజేపీ( BJP ) అధిష్టానం చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే.పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని రాష్ట్ర నేతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తులపై రెండు, మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.