బాబు 'రహస్యం' తో ఇబ్బందిపడుతున్న అధికారులు ?  

Chandrababu Passed 18 Secret Gos-chandrababu,elections,manifesto,secret Gos,ycp,అధికారులు,రహస్యం

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్ రావడం ఒక్కటే మిగిలి ఉంది. ఈ లోపున జరగాల్సిన గొడవంతా జరిగిపోతూనే ఉంది..

బాబు 'రహస్యం' తో ఇబ్బందిపడుతున్న అధికారులు ?-Chandrababu Passed 18 Secret Gos

అసలు మీరు సమీక్షలు, సమావేశాలు నిర్వహించే అధికారం లేదు అంటూ బాబు ని ప్రశ్నిస్తోంది వైసీపీ. అయితే మా ప్రభుత్వానికి ఇంకా చాలా రోజులు టైం ఉంది. అమెరికాలో అయితే కొత్త ప్రభుత్వం వచ్చినా ఆరు నెలలు పాత ప్రభుత్వమే అధికారం చెలాయిస్తోంది అంటూ బాబు లెక్కలు చెబుతున్నాడు.

అలా చెప్పడమే కాదు తాను చేయాల్సింది అంతా చేసి చూపిస్తున్నాడు. అయితే బాబు ఇప్పుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అధికారులకు ఇబ్బందికరంగా మారింది. కరవమంటే కప్పకు కోపం , వదలమంటే పాముకి కోపం అన్నట్టుగా అధికారులు టీడీపీ , వైసీపీ మధ్య నలిగిపోతున్నారు.

అసలు విషయం ఏంటి అంటే ప్రభుత్వంలో రహస్య జీవోలు కొత్తేమి కాదు. కొన్ని ఆదేశాల్ని రహస్యంగా ఉంచాల్సిన సమయంలో ఇటువంటి రహస్య జీవోలు జారీ చేస్తుంటారు. కానీ ఆపద్ధర్మ ప్రభుత్వానికి మాత్రం ఇలాంటి జీవోలు జారీ చేసే అధికారం లేదు.

బాబు మాత్రం తనను తాను రాజకీయ అతీత శక్తిగా ఊహించుకుంటున్నాడు. ఆపద్ధర్మ సీఎం అని తెలిసి కూడా రహస్య జీవోల్ని జారీ చేస్తుండడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ జీవోల గురించివు ప్రస్తావిస్తే ఇరుక్కునేందు తామే అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

ఈ మూడు వారాల్లోనే 18 రహస్య జీవోల్ని బాబు జారీ చేసాడట. వీటిలో సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖలకు చెందిన జీవోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, ఆర్థిక, హోంశాఖ రంగాలకు చెందిన జీవోల్లో ఎక్కువగా గోప్యత పాటిస్తారు. కానీ సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖలకు చెందిన జీవోల్లో రహస్యం ఏముంటుంది? ఇది ప్రజలకు సంబంధించిన అంశం కదా! మరి అటువంటప్పుడు అంత రహస్యంగా ఉంచాల్సిన పనేంటి అన్న ప్రశ్నకు బాబు దగ్గర సమాధానం లేదు

తన పరిపాలనా కాలంలో బాబు చేసిన అక్రమాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా రహస్య జీవోలు జారీచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తామేమి ఊరికే చూస్తూ ఉండబోమని, ఆ చీకటి జీవోల గుట్టు రట్టుచేస్తామని వైసీపీ ప్రకటించింది.

అధికారంలోకి రాగానే బాబు రహస్య జీవోల సంగతి ప్రజల ముందుంచుతామని చెప్తోంది. ప్రజలకు అత్యంత అవసరమైన రెవెన్యూ లాంటి రంగాల్లోనే రహస్య జీవోల సంఖ్య ఎక్కువగా ఉంది. అన్నింటికంటే గమ్మత్తయితే విషయం ఏంటంటే..

రెవెన్యూ తర్వాత లోకేష్ పరిధిలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖలో ఈ రహస్య జీవోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాబు మాత్రం ఈ విషయంలో పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కుంటుంటుండగా , అధికారులు మాత్రం ఆందోళనగా ఉన్నారు.