బాబు సొంత సర్వేలో ఇలా తేలిందా ?  

Chandrababu Own Survey-jobs,people,tdp,ycp

ఏపీ తెలుగుదేశం పార్టీ కి ఎన్నికల్లో గెలుపు ధీమా ఎక్కడా తగ్గడంలేదు. ఫ్యాన్ గాలి ప్రభంజనం గట్టిగా ఉన్నట్టే కనిపిస్తున్నా టీడీపీ మాత్రం విజయం తమదే అన్న ధీమాలో ఉంది. ఒక వైపు టీడీపీ అధికారానికి దూరం అవ్వాల్సిందే అని పార్టీ నేతలు కూడా డిసైడ్ అయినా ఆ పార్టీ అధినేతకు మాత్రం గెలుపు మనదే అన్న డైలాగులను మాత్రం వదలడంలేదు..

బాబు సొంత సర్వేలో ఇలా తేలిందా ?-Chandrababu Own Survey

దీనికి తోడు బాబు సొంతంగా చేయించిన సర్వేలో టీడీపీ అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఖాయం అని అందులో ఎటువంటి సందేహం లేదని ఆ సర్వేల్లో తేలిందట. మొదటి సర్వేలో టీడీపీకి దాదాపు 150 సీట్లు వస్తాయని తేలడంతో ఆ సర్వేను పక్కన పెట్టిన పార్టీ అధినేత చంద్రబాబు మరో సర్వే చేయించారని తెలిసింది. రెండో సర్వేలో 110 సీట్లు వస్తాయని తేలిందట.

ఈ రెండు సర్వేలతోపాటూ పార్టీ నేతలకు కూడా తెలియకుండా చంద్రబాబు మరో రెండు సర్వేలు చేయించారట. ఆ రెండు సీక్రెట్ సర్వేల్లోనూ టీడీపీకి 100 నుంచీ 120 సీట్ల వరకు వస్తాయని తేలడంతో అన్నింటినీ లెక్కలోకి తీసుకొని చివరకు చంద్రబాబు 110 సీట్లు ఖాయం అని ఫిక్స్ అయిపోయారట. పైకి గెలుస్తామని దైర్యంగా చెబుతున్నా గెలుపు అంత సులువు కాదనే విషయం బాబు కి కూడా తెలుసునని, అలా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటే నాలుగు సర్వేలు ఎందుకు చేయించారని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ చేయించిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ముసలివాళ్లు, మహిళలు టీడీపీకి అండగా నిలబడగా యూత్ మాత్రం జనసేన, వైసీపీకి వేశారని తేలిందట.

టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీద ప్రజల్లో మంచి సానుకూల దృక్పధం ఉందని అందుకే ఓట్ల రూపంలో ఆ అభిమానాన్ని చూపించారని టీడీపీ చెప్తోంది. కాకపోతే ఉద్యోగాల కల్పనలో మాత్రం ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పని చేయలేకపోవడం వల్ల యువత వైసీపీ వైపు డైవర్ట్ అయినట్టు టీడీపీ చేయించిన అంతర్గత సర్వేల్లో తేలిందట. తమ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారంటున్న చంద్రబాబు ఈసారి 2014లో కంటే ఎనిమిది సీట్లు ఎక్కువే సాధిస్తామన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ మాకు 120 నుంచీ 140 స్థానాలు వస్తాయని చెబుతోంది.