ఢిల్లీ లో బాబు : పెద్ద పంచాయతీనే ప్లాన్ చేశారుగా ?

దొరికిందే చాన్స్ గా వైసీపీ ప్రభుత్వం పై అనేక ఫిర్యాదులు చేసి, రాజకీయంగా మైలేజ్ సంపాదించేందుకు తెలుగుదేశం పార్టీ పటిష్టమైన ప్రణాళిక తో ఉంది.దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లారు.

 Chandrababu New Political Stratagy On Delhi Tour Chandrababu, Delhi Tour, Tdp, B-TeluguStop.com

ఈరోజు మధ్యాహ్నం 12 :30 కి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిసేందుకు టిడిపి బృందానికి అపాయింట్మెంట్ దొరికింది.మొత్తం చంద్రబాబు టూర్ లో 18 మంది టిడిపి నేతలు ఉన్నారు.

వీరంతా ఏపీ ప్రభుత్వం పై నా, ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి పైన జరిగిన దాడి, అలాగే టిడిపి ప్రధాన కార్యాలయం ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడం తదితర అంశాలపై ఫిర్యాదు చేయడంతో పాటు, ఏపీలో ఆర్టికల్ 356 ను అమలు చేయాలనే డిమాండును టిడిపి బృందం రాష్ట్రపతి ముందు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.ఢిల్లీలో ఈరోజు అనుసరించాల్సిన వ్యూహంపై శనివారం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యి అనేక కీలక విషయాలపై చర్చించారు.

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి భౌతిక దాడులకు జరగలేదని, అందరూ కలిసి ప్రఝాస్వామ్యబద్దంగా సిద్ధాంతం ప్రకారం ఎన్నికలకు వెళదామని ఈ సందర్భంగా పార్టీ నేతలకుసూచించారట.ఇక ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు, బిజెపి పెద్దలను కలిసి  టిడిపి కార్యాలయంపై దాడి వ్యవహారం తో పాటు ఏపీ లో చోటు చేసుకున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలపై ఫిర్యాదు చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇప్పటికే రాష్ట్రపతి , కేంద్ర హోం మంత్రికి చంద్రబాబు లేఖలు రాశారు.ప్రస్తుతం తన బృందంతో వైసీపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడంతో పాటు, జాతీయ మీడియా దృష్టిలో పడి, ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా సరికొత్త వ్యూహాలతో చంద్రబాబు టీమ్ ఢిల్లీలో వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది.

Telugu Ap, Chandrababu, Delhi, India, Pattabi, Ramanath Covind, Ysrcp-Telugu Pol

కాకపోతే బాబు కి బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేనట్టుగా ఢిల్లీ లో పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బాబుకి అపాయింట్మెంట్ నిరాకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలో బీజేపీ పెద్దలను బాబు ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube