ఎన్ఠీఆర్ జయంతి ని మరచిన బాబు...ఇకపై మేమే జరుపుతాం అంటూ ఎన్ఠీఆర్ ప్రకటన

తెలుగు జాతి ముద్దు బిడ్డ గా పిలవబడే ఎన్ఠీఆర్ 97 వ జయంతి నేడు.ఆయన జయంతి అంటే ఎప్పుడూ ఎంతో ఆర్భాటంగా కనిపించే ఎన్ఠీఆర్ ఘాట్ ఈ రోజు వెలవెల బోయింది.

 Chandrababu Neglected Ntr Jayanti-TeluguStop.com

ఎప్పుడూ కూడా పూలతో సర్వాంగ సుందరంగా తయారయ్యే ఎన్ఠీఆర్ ఘాట్ పూర్తిగా కళ తప్పి కనిపించింది.ఎలాంటి పూలు గానీ, ఏర్పాట్లు గానీ లేవు, అవే మొండి సమాధి గోడలు కనిపించాయి.

కనీసం ఘాట్ వద్ద ఒక్క ప్లెక్సీ కూడా లేకపోవడం విశేషం.

ఎన్ఠీఆర్ జయంతి ని మరచిన బాబు�

నిన్నటి వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరిపించేవారు.మరి ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి ఫలితమో ఏమో గానీ అక్కడ అంతా వెలవెల బోయింది.ఓడినా.

గెలిచినా ఇంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలుగుదేశం వ్యవస్థాపకుడిని ఆయన జయంతి నాడు స్మరించుకోవడం కనీస మర్యాద.కానీ ఓటమి భారంతో చంద్రబాబు.

అధికారం కోల్పోవడంతో టీడీపీ నేతలు పట్టించుకోకపోవడం తో ఎన్టీఆర్ ఘాట్ కళ తప్పింది.కనీసం ఆయనకు నివాళులు కూడా అర్పించకపోవడం తో చంద్రబాబు తీరుపై ఇప్పటికే అభిమానులు – ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నారు.

ఒకపక్క ఓటమి భారంతో చంద్రబాబు.ఎన్టీఆర్ జయంతిని వదిలేసినా.మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాత జయంతి ని మరువలేదు.ఎప్పటిలాగే ఈ ఉదయం 5.30గంటలకే అన్న కళ్యాణ్ రామ్ – కుటుంబ సభ్యులతో కలిసి తాత ఎన్టీఆర్ కు నివాళులర్పించడానికి ఘాట్ కు వచ్చారు.అయితే అక్కడ పూలతో కళకళలాడాల్సిన సమాధి కళ తప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లు కలిసి హుటాహుటిన పూలమాలలు,పూలు తెప్పించి అక్కడ ఉన్న వారి సాయం తో స్వయంగా తాత సమాధిని అలంకరించారు.

ఎన్ఠీఆర్ జయంతి ని మరచిన బాబు�

మా తాత గారిని ఎవ్వరూ పట్టించుకోకున్నా ఇక నుంచి ఎన్టీఆర్ జయంతి – వర్ధంతిని తాను నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఎన్ఠీఆర్ మీడియా కు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఇప్పటికే ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడం తో ఆ పార్టీ రెండు భాగాలుగా చీలిపోనుంది అంటూ వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే.ఇక ఆ పార్టీ కి జూనియర్ ఎన్ఠీఆరే దిక్కు అంటూ పలువురు సోషల్ మీడియా లో ట్వీట్స్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.అయితే ఇప్పుడు తాజా ఘటన తో ఆ వార్తల్లో నిజం ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube