లోకేష్ కు పెద్ద పదవి ? మహానాడు వ్యూహం అదేనా ?

తన రాజకీయ వారసుడు నారా లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం పెంచాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు.తాను ఎంతో కాలం యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండే అవకాశం లేకపోవడంతో లోకేష్ టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించి మరింత ప్రాధాన్యం ఇచ్చే విధంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

 Chandrababu Naidu Give The Ap Tdp Working President To Nara Lokesh, Chandrababu-TeluguStop.com

దీనికోసం సరైన సమయం కోసం ఇప్పటి నుంచే చంద్రబాబు ఎదురుచూపులు చూస్తున్నారు.అయితే కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు ఆశ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

ఇదిలా ఉంటే ప్రతియేటా తెలుగుదేశం పార్టీ మహానాడు ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తూ ఉంటుంది.అయితే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా మహానాడు వాయిదా పడింది.

ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహించాలని చూసినా, కరోనా వైరస్ కారణంగా ఆ ఆశ తీరేలా కనిపించడం లేదు.

Telugu Chandrababu, Lokesh, Tdp Mahanadu-Political

కొద్దిమందితో అయినా మహానాడు ను నిర్వహించాలా లేక జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లో అయినా, నిర్వహించాలా అనే విషయంపై ఇంకా తర్జనభర్జన పడుతున్నారు.ఎట్టి పరిస్థితుల్లో అయినా మే నెలాఖరు నాటికి మహానాడును నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.అసలు ఈ సమావేశాన్ని నిర్వహించాలనే పట్టుదల ఇంకా ఉండడానికి కారణం కూడా లేకపోలేదు.

ఇప్పటికే పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీ కేడర్ లో నూతన ఉత్సాహం తీసుకురావడంతో పాటు, అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహాలు గురించి చర్చించడం, అలాగే తెలుగుదేశం పార్టీలో ఓ కొత్త పదవిని సృష్టించేందుకు మహానాడు ను వేదికగా చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Telugu Chandrababu, Lokesh, Tdp Mahanadu-Political

ముఖ్యంగా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసెంట్ పదవి అనేది లేదు.అయితే లోకేష్ ప్రాధాన్యం పెంచేలా, పార్టీ కార్యక్రమం ఏదైనా ఆయన కనుసన్నల్లో జరిగేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే ఇప్పుడు మహానాడును నిర్వహించేందుకు, లోకేష్ ప్రాధాన్యాన్ని పెంచేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.కొంతకాలం పాటు తన పర్యవేక్షణలో లోకేష్ అన్ని కార్యక్రమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాబు ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube