బాబు 'ఓదార్పు' కొందరికి మాత్రమేనా ?  

Chandrababu Naiud Padayatra Only For These People-tdp,ys Jagan,ysrcp,ఓదార్పు

ఏపీలో బలపడాలనే ఆశ, ఆలోచన బీజేపీని కుదురుగా ఉండనీయడంలేదు. వీలైనంత తొందరగా ఇతర పార్టీల్లో కీలక నాయకులను, ఎమ్యెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురిని పార్టీలో చేర్చుకున్నఆ పార్టీ ఇంకా బలపడాలనే ఆలోచనతో ఉంది..

బాబు 'ఓదార్పు' కొందరికి మాత్రమేనా ?-Chandrababu Naiud Padayatra Only For These People

ముఖ్యంగా టీడీపీ నుంచి భారీగా వలసలు వస్తాయని ఎదురుచూస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీలో ఆందోళన పెంచుతున్నాయి. అయితే టీడీపీని వీడే నాయకుల విషయంలో ఈ సారి చంద్రబాబు భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అయితే పార్టీ నుంచి వలసలు పెరగకుండా, క్యాడర్లో ధైర్యం పెరిగేలా ఇప్పటికే చంద్రబాబు కార్యర్తలు, నాయకులను కలుసుకునేందుకు ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు.

తెలుగుదేశం పార్టీని వదిలి బీజేపీ, వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నాయకుల్లో కొంతమందిని మాత్రమే బాబు బుజ్జగిస్తున్నారని, మరికొందరి విషయంలో పోతే పోనీ అనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ నేతలకు క్షేత్ర స్థాయిలో బాగా పట్టు ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకులు బీజేపీ వైపు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ అలాంటి ఒకరిద్దరు నేతలు బీజేపీ, వైసీపీ వైపు చూసినా వారిని పిలిచి మాట్లాడేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్న మాట..

ఇక మొత్తం పార్టీ మీదే భారమంతా వేసి తమ బలం ఏమి లేకుండా కేవలం పార్టీ ఇమేజ్‌తో గెలిచే నాయకులు పార్టీ మారాలని తన దృష్టికి వచ్చినా వారిని ఏ మాత్రం అడ్డుకోకుండా వదిలేయాలని చంద్రబాబు ఆలోచనట. ఒకవేళ వారు వెళ్లినా వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రొత్సాహించాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వంపై చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే బాబు ప్రజాబలం ఉన్న నాయకులను తప్ప మిగతా నాయకులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.