కరోనా ఏటీఎం : విరాళాల పేరుతో వసూళ్లా ? బాబు వర్సెస్ వైసీపీ ఎంపీ

ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజు కి వేడెక్కి హెత్తెక్కిస్తూనే ఉంది. ఒక వైపు కరోనా మరో వైపు పొలిటికల్ హీటు ఇలా అన్నిరకాలుగా ఏపీ వాతావరణం వేడిక్కిపోతోంది.

 Tdp Chandrababu Naidu Comments On Vijasai Reddy About The Collect The Corona Fun-TeluguStop.com

ఒకవైపు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూనే ఉంది.అయినా కరోనా అదుపులోకి రాకపోగా, మరింతగా విస్తరిస్తూ వస్తోంది.

ఒకవైపు కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే, మరో వైపు పేద ప్రజలు ఎవరూ ఇబ్బందిపడకుండా చూస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూస్తూనే ప్రభుత్వ పరంగా ఏ లోటు లేకుండా చూసుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా ఉండడంతో పాటు ఈ వైరస్ కు విరుగుడు మందు ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకుండా విరాళాల సేకరణకు ప్రముఖులంతా రంగంలోకి దిగారు.

ఎవరికి వారు తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా విరాళాలు సేకరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విరాళాల సేకరణకు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ విరాళాలు సేకరించేపనిలో పడ్డారు.

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విశాఖలో చందాలు వసూలు చేస్తున్నారని, ఆయన ట్రస్ట్ ముసుగులో బలవంతపు వసూళ్లకు దిగుతున్నారని, కరోనా సంక్షోభం వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు ఈ విధంగా వసూళ్లకు దిగినట్టుగా బాబు మండిపడుతున్నారు. దీనిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Telugu Chandrababu, Tdp Ycp, Vijaysai Reddy, Ycp-Political

తాము సేకరిస్తున్న విరాళాలన్నీ, స్వచ్చందంగానే వస్తున్నాయని, ఎవరు బలవంతపు వసూళ్లకు పాల్పడటం లేదని, కావాలంటే విరాళాలు ఇచ్చిన వారిని అడగవచ్చు అంటూ విజయసాయి మండిపడ్డారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే సహకరించాలే తప్ప, బురద జల్లే పనే ఏ ఒక్కరూ చేయకూడదని, అసలు బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు బాబుకు ఎవరైనా వచ్చి చెవిలో చెప్పారా అని విజయసాయి నిలదీశారు.కరోనాని ఏటీఎంగా వాడుకుంటున్నారని మాట్లాడుతున్నారని, ఇటువంటి సమయంలో కూడా ఈ విధమైన విమర్శలు చేసేది మీ పార్టీ వాళ్లే అంటూ తీవ్ర స్థాయిలో విమర్సలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో మీకు ఎన్ని ఏటీఎంలుగా మారింది అనేది ప్రజలకు బాగా తెలుసని, ప్రతి దానిలోనూ దోపిడీ చేసారు కాబట్టే, ప్రజలు మిమ్మల్ని ఓడించి ఇంటికి పరిమితం చేశారని, అనవసర విమర్శలు మాని ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది అంటూ విజయసాయి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube