ఎన్నికల్లోగా...బాబు చాప్టర్ క్లోజ్...   Chandrababu Naidu Will Be Effect By IT Before Elections     2018-10-16   13:34:27  IST  Surya

మోడీ..భారత దేశంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న నేత..గతంలో ఎన్నడూ ఏ ప్రధాని కూడా మోడీలా దూకుడుగా వ్యవహరించలేదనే చెప్పాలి..ప్రపంచ స్థాయిలో మోడీ కి ఫాలోయింగ్ కూడా ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే తన ఎదుగుదల కోసం అందివచ్చిన ఎటువంటి అవకాశాన్ని అయినా వదులుకోలేదు..అదేవిధంగా తన ఎదుగుదలకి అడ్డు వచ్చిన వారిని కూడా మోడీ అణిచివేసే వరకూ వదలలేదు. ఈ క్రమంలోనే…

చంద్రబాబు నాయుడు , మోడీ పరువు జాతీయ స్థాయిలో పోగొట్టేలా , కేంద్రంలో బీజేపీ కి ప్రత్యామ్నాయం కోసం మోడీ వ్యతిరేక శక్తులతో బాబు చేతులు కలపడం ప్రత్యేక హోదా విషయంలో మోడీ కి వ్యతిరేకంగా బాబు పన్నిన కుట్రలు..ఇలా ఒకటి కాదు రెండు ఎన్నో రకాలుగా బీజేపీ పరువుని బజారుకి ఈద్చడంలో బాబు కొంత మేర సక్సెస్ అయ్యారనే చెప్పాలి…అయితే తనకి అడ్డు వస్తారని అనుకున్న ఎవరిని అయినా సైడ్ చేయడంలో మోడీ ని మించిన వాడు ఎవరూ లేరని చెప్పాలి ఎందుకంటే…

అద్వానీలాంటి వాళ్లనే బలవంతంగా రిటైర్మెంట్ చేయించాడు, వెంకయ్యనాయుడు లాంటి ఉద్దండులని సైడ్ చేసేశాడు. మరి అలాంటి మోడీకి చంద్రబాబు ఓ లెక్కా. ఇప్పుడు ఇదే అందరి మదిలో మొదలయిన ప్రశ్న….ప్రత్యేక హోదా విషయంలో బాబు చేసిన హడావిడికి ఇప్పుడు మెల్ల మెల్లగా ప్రతీకారం తీర్చుకుంటోంది కేంద్రం..ఐటీ దాడుల పేరుతో చంద్రబాబు ఆర్ధిక శక్తులపై జరుగుతున్నా దాడులు జస్ట్ సాంపిల్ మాత్రమేనట.

Chandrababu Naidu Will Be Effect By IT Before Elections-

నిన్నటితో దాడులు ముగిసాయని ఊపిరి పీల్చుకుంటున్నారు టీడీపీ నేతలు..అయితే ఈ దాడులకి భయపడే వాళ్ళం కాదు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్సితున్నా లోలోపల మాత్రం ఒక్కొక్కరికి 102 కొట్టుకుంటో౦దట అయితే ఈ సినిమా ఇక్కడితో ఆగిపోలేదు. మోడీని ముందుంచి తెరవెనక అమిత్ షా రివేంజ్ డ్రామాని రక్తికట్టించే పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన కొన్ని కుంభకోణాల్ని కేంద్రం బయటపెట్టబోతోందనే వార్త జోరుగా వినిపిస్తోంది..

పోలవరం, రాజధాని ఒప్పందాలు, భూసేకరణలో జరిగిన అవినీతి ఇలా ఒకటి కాదు రెండుకాదు అనేక విషయాలలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి బండారాన్ని బయటపెట్టడానికి సర్వం సిద్దమయ్యిందట..ఇప్పటి వరకూ జరిగిన ఐటీ దాడులు సాంపిల్ మాత్రమేనని త్వరలో భారీ స్థాయిలో పెద్ద తలకాయలపై ఈ దాడులు ఉంటాయని అంటున్నారు విశ్లేషకులు…ఈ క్రమంలోనే బాబు ని జైలుకి పంపే ప్లాన్ కూడా సిద్దంగానే ఉండనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.