ఆ విధంగా టీడీపీ లాభపడాలని చూస్తోందా ...? అందుకే ఈ ప్యాకేజీలా..?

చిత్ర విచిత్రమైన సంఘటనలు… రకరకాల ఎత్తుగడలు అన్నీ … ఎన్నికల సమయంలో బయటపడుతుంటాయి.రాజకీయ పార్టీలు గెలుపే తమ అంతిమ లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.

 Chandrababu Naidu Whats To Focus On Media For Next Elections-TeluguStop.com

జనం లోకి సులువుగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్లగలమో తెలుసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ప్రస్తుతం జనాల్లోకి అతి వేగంగా వెళ్లగలిగే సాధనం ఏదైనా ఉందా అంటే అది కేవలం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా.ప్రస్తుతం సోషల్ మీడియా శరవేగంగా… దూసుకుపోతోంది.అయితే… గ్రామస్థాయిలో మాత్రం ఇంకా అనేక మంది టీవీ చానల్స్, న్యూస్ పేపర్ల మీద ఆధారపడి రాజకీయాలను అంచనా వేసే పరిస్థితి ఉంది.

పత్రికలు ఛానెల్స్ లో వచ్చిన న్యూస్ ను ఫాలో అవుతూ అదే నిజం అన్నట్టుగా భావించే పరిస్థితుల్లో ఉన్నారు.అందుకే రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మీడియా ను తమ అదుపులో పెట్టుకునేందుకు చూస్తున్నాయి.ఇప్పటి కే ప్రతి రాజకీయ పార్టీకి సొంతంగా మీడియా చానల్స్ ఉన్నాయి.కాకపోతే టిడిపి కి అంటూ… ప్రత్యేకంగా ఒక న్యూస్ ఛానల్ లేకపోయినా మీడియా లో ఉన్న మెజారిటీ మీడియా చానల్స్ లో కొన్నిటిని తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం నడుపుతోంది.

వీటి ద్వారానే… ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ఆ మీడియాల్లో కథలు కథనాలు వచ్చేలా ముందు నుంచే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.దీనిలో భాగంగానే కొన్ని మీడియా ఛానెల్స్ కి స్పెషల్ ఎలక్షన్ ప్యాకేజీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో టీడీపీ ఎప్పుడూ అలెర్ట్ గానే ఉంటుంది.అయితే గత ఎన్నికల విషయాన్నీ పరిగణలోకి తీసుకుంటే… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత మాత్రమే ఈ ప్యాకేజీలు అందించే సంప్రదాయాన్ని కొనసాగించేవారు.అయితే ఇప్పుడున్న పోటీ రాజకీయ వాతావరణంలో ఆ ట్రెండ్ మార్చేశారు.కానీ ఇప్పుడు ఎన్నికల సీజన్‌కు ముందే ఏపీలో ప్యాకేజీలను టీడీపీ ఇచ్చే సంప్రదాయాన్ని మొదలుపెట్టేసింది.ముఖ్యంగా… రెండు చానళ్లు టీడీపీ వాయిస్ వినిపించేందుకు సిద్ధం అయినట్టు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా ప్రైమ్‌టైమ్‌లో డిబేట్ల పేరుతో టీడీపీ అనుకూల ప్రచారం నడుస్తోందని చెబుతున్నారు.అదేవిధంగా… తటస్తుల పేరుతో టీడీపీ అనుకూల ప్రచారం చేయడం ఈ ప్యాకేజీ లో ప్రధాన ఘట్టంగా తెలుస్తోంది.ఇదే విషయాన్ని ముందుగానే కనిపెట్టిన వైసీపీ అధినేత జగన్ ఎల్లో మీడియా తో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పదే పదే పిలుపునిస్తున్నాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube