బాబోయ్ బాబు ! జూనియర్ ఎన్టీఆర్ కి ఇలా దెబ్బేస్తున్నాడా ..?  

 • టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఎవరికీ అర్ధం కావు. సమయానుకూలంగా ప్రోగ్రాములు మార్చబడును అన్నట్టుగా పరిస్థితులకు అనుగుణంగా ఎవరూ ఊహించని విధంగా మాస్టర్ ప్లాన్ లు వెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. మొన్నటి వరకు నందమూరి కుటుంబాన్ని పక్కనపెడుతూ వచ్చిన బాబు హరికృష్ణ మరణం తరువాత కొంచెం దగ్గరయినట్టు కనిపించాడు. దీంతో ఇక బాబు జూనియర్ ఎన్టీఆర్ ని చేరదీస్తున్నాడు అంటూ అంతా అనుకున్నారు.ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం కూడా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ బాబు నుంచి ఏ స్పందన లేదు.
  జూనియర్ ని ఇప్పుడు చేరదీస్తే భవిష్యత్తులో ఆయన పార్టీలో పట్టు సాధించి ఆ తరువాత తమ మాట వినడని బాబు ఒక అంచనాకు వచ్చాడు.

 • Chandrababu Naidu Want To Harikrishna Daughter In Elections-Harikrishna Suhasini Jr Ntr Kalyanram Kukatpally Constituency

  Chandrababu Naidu Want To Harikrishna Daughter In Elections

 • వాస్తవంగా… హరికృష్ణ మరణం తరువాత … బాబు నందమూరి కుటుంబాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా ముందుగా… కల్యాణ్ రామ్‌ను రాజకీయంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా కల్యాణ్‌ రామ్ ను టీడీపీ నేతల బృందం వెళ్లి కలిసింది. కానీ అందుకు కల్యాణ్ రామ్ సున్నితంగానే తిరస్కరించారు.

 • Chandrababu Naidu Want To Harikrishna Daughter In Elections-Harikrishna Suhasini Jr Ntr Kalyanram Kukatpally Constituency
 • ఈ నేపథ్యంలో హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును కొత్తగా బాబు తెరపైకి తెస్తున్నారు.ఆమెను బరిలో దింపేందుకు టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై పార్టీలో సీనియర్ లు కూడా ధ్రువీకరిస్తున్నారు.

 • Chandrababu Naidu Want To Harikrishna Daughter In Elections-Harikrishna Suhasini Jr Ntr Kalyanram Kukatpally Constituency
 • వాస్తవంగా …కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా టీడీపీకే దక్కింది. ఇప్పటికే పెద్దిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అక్కడ ప్రకటించారు. కానీ హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీకి అంగీకరిస్తే ఆమెను బరిలో దింపుతారని చెబుతున్నారు. సుహాసిని పోటీకి అంగీకరిస్తే . అది పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఒంటరిని చేయడమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నా… అందుకు బాబు నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదట. బాబు తనయుడు లోకేష్ ప్రస్తుతం నెంబర్ 2 స్థానంలో ఉన్నా … రాజకీయంగా అంత పరిణితి చెందలేదు. దీంతో జూనియర్ వంటి సమర్థులను చేరదీస్తే అసలుకే ఎసరు వస్తుందనేది బాబు అసలు రహస్యం.