పొమ్మనలేక పొగ పెడుతున్న బాబు...ఆ సీనియర్స్ డౌటే....     2018-09-18   12:25:57  IST  Bhanu C

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. 2019 ఎన్నికలు చావో రేవో అవడంతో చంద్రబాబు ఎంతో వుహత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీలో ఉన్న ఇద్దరు సీనియర్ మంత్రులకి చెక్ పెట్టనున్నారట…అయితే అందుకు తగ్గ కారణాలని సైతం బాబు సిద్దం చేసి ఉంచారని తెలుస్తోంది..చంద్రబాబు కి అందిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ల ఆధారంగా ఆ ఇద్దరు మంత్రులకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడంలేదని తెలుస్తోంది. వివరాలలోకి వెళ్తే..

ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రులుగా ఒక వెలుగు వెలుగుతున్న చినరాజప్ప – కేఈ కృష్ణమూర్తిలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కకపోవచ్చని టీడీపీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి..గత కొంతకాలంగా వారిద్దనిని చంద్రబాబు సరిగ్గా పట్టించుకోక పోవడమే అందుకు నిదర్సనం అంటున్నారు..నిజానికి వారు ఇరువురు నేతలు పేరుకే మంత్రులు సంతకాలు పెట్టడానికి కానీ, ఇతరాత్రా విషయాలలో వారి అవసరం బాబు కి కావాలి తప్ప పార్టీలో కీలక నేతలుగా వారిని బాబు గుర్తించడం లేదట…దాంతో సదరు నేతలు బాబు పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లుగా తెలుస్తోంది..

కేఈ విషయానికి వస్తే తన సొంత శాఖలో తనంతట తానుగా ఎలాంటి పని చేసుకోలేక పోతున్నారట..ఇక చినరాజప్ప పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉందట దాంతో వీరు ఇరువురు బాహాటంగానే బాబు పై విరుచుకు పడుతున్నారట.అయితే వారి ఇరువురికి ప్రజలలో ఆదరణ లేదని..కనీసం ప్రజలలో తిరగలేని పరిస్థితిలో ఉన్న ఇద్దరు నేతలకి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ శ్రేణులు తెగ చెవులు కొరుక్కుంటున్నారట..

Chandrababu Naidu Want To Eliminate Chinna Rajappa-Chandrababu Naidu,Chandrababu Naidu Want To Eliminate Chinna Rajappa,Chinna Rajappa,Elections In AP,TDP

అయితే గతంలోనే వచ్చే ఎన్నికల్లో తానూ పోటీ చేయలేనని నాకు ఇచ్చే సీటు తన కుమారుడికి ఇవ్వమని కేఈ చంద్రబాబు తో చెప్పారట అయితే తన కుమారుడిపై కేసులు ఉన్న కారణంగా అతనికి ఇవ్వడం కుదరదని చెప్పారట చంద్రబాబు…ఇక మరొక ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప టిక్కెట్టు కి లోకల్ నేత ఒకరు ఎసరు పెడుతున్నారు, గతంలో టీడీపీ నుంచీ వైసీపీలోకి వెళ్ళిన ఒక నేత మళ్ళీ జగన్ ని విడిచి టీడీపీలోకి వచ్చేశారట అయితే చంద్రబాబు సదరు నేతవైపు దృష్టి పెట్టి రాజప్ప టిక్కెట్టుకి ఎసరు పెట్టేలా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.