టీడీపీ అధ్యక్షుడిగా యంగ్ ఎంపీ ?

ఏపీలో మరో ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాలి.అంటే ఈ ఐదేళ్లపాటు అధికార పార్టీ వైసీపీ మీద పోరాటం చేస్తూ, తమ పార్టీ నాయకులకు మద్దతుగా నిలబడుతుండాలి.

 Chandrababu Naidu Want Rammohan Naidu As Tdp Chief-TeluguStop.com

ఈ దశలో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పనితీరు అంతంత మాత్రంగానే ఉంది.అయన ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నా లేనట్టుగానే ఉంటున్నారు.

అప్పుడప్పుడూ జగన్ మీద విమర్శలు చేస్తూ మీడియాలో కనిపించడం తప్ప ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కడంలేదు.ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో కళా వెంకట్రావు ను కొనసాగిస్తే వైసీపీ మీద ఎదురుదాడి చేయడం కష్టం అనే భావనలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు.

-Telugu Political News

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండి, వాక్చాతుర్యం తో పాటు అవినీతి మరకలు లేని వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించిన బాబు అందుకు తగ్గ నేత కోసం చూస్తుండగా ఆ లక్షణాలు అన్ని ఉన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన మదిలో మెదిలాడట.ఆయనను ఎంపిక చేస్తేనే మళ్లీ కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని నమ్ముతున్నారట.గుంటూరు జిల్లాలో అమరావతికి దగ్గర్లో ఉన్న ఉండవల్లిలో ఈ రోజు టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరగబోతోంది.ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

అయితే దీనిపై బాబు సన్నిహితుల నుంచి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు.

రామ్మోహన్ నాయుడు ను ఎంపిక చేద్దామనే ఆలోచన బాబుకి రావడానికి కారణం కూడా లేకపోలేదు.

అదేంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీచినా కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు పోటీ చేసిన మూడు చోట్ల విజయం సాధించారు.అంటే ప్రజల్లో ఆ కుటుంబం, ఆ నేతలపై ఎంత ఆదరాభిమానం ఉందో క్లియర్‌గా బాబు కు అర్ధం అయ్యిందని పార్టీలో చర్చ నడుస్తోంది.

అందుకే రామ్మోహన్ నాయుడు పేరును బాబు ప్రతిపాదించబోతున్నాడట.అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి రామ్మోహన్ నాయుడు కూడా సిద్దంగానే ఉన్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube