వైసీపీని టెన్షన్ పెడుతున్న బాబు అక్కడ ఏం మాట్లాడతాడో ?

పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా భవిష్యత్తు ఎంత అంధకారంగా ఉన్నా ఎక్కడా అదరకుండా బెదరకుండా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లగలిగిన సమర్ధుడు టీడీపీ అధినేత చంద్రబాబు.ఇప్పుడు ఏపీలో టీడీపీ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ అనేక కేసులను, అవినీతి వ్యవహారాలను తవ్వి తీస్తోంది.

 Chandrababu Naidu Vizag Tour In Today How Vizag People Receive In Chandrababu-TeluguStop.com

ఈ కేసుల్లో చంద్రబాబు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కొత్త కొత్త కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.ఇంతవరకు బాగానే ఉన్నా ఈ వ్యవహారాలు వీటిని పట్టించుకోనట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర కూడా మొదలు పెట్టాడు.వైసీపీ ప్రభుత్వ లోపాలు, కక్షసాధింపు ధోరణి ఇవన్నీ హైలెట్ చేస్తూ బాబు ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం బాబు ప్రజా చైతన్య యాత్ర విశాఖలో జరగబోతున్న నేపథ్యంలో బాబు యాత్రపై అనేక సందేహాలు నెలకొన్నాయి.

Telugu Chandrababu-Political

విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న తరువాత చంద్రబాబు తొలిసారి విశాఖకు వస్తున్నారు.ఆయనకు విశాఖలో ఎలాంటి అనుభవం ఎదురవుతుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.వైసీపీ చేసే ఆందోళనల సంగతి ఎలా ఉన్నా విశాఖ వాసులు ఏ విధంగా బాబు యాత్రను రిసీవ్ చేసుకుంటారు అనేది సందేహంగా మారింది.

చంద్రబాబు పర్యటన ద్వారా టీడీపీకి ఓ స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.చాలాకాలంగా అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ పోరాటం చేస్తోంది.ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఎంత స్పీడ్ గా ముందుకు వెళ్తుందో అంతే స్పీడ్ గా టీడీపీ కూడా అమరావతి విషయాన్ని హైలెట్ చేస్తోంది.

Telugu Chandrababu-Political

ప్రజాచైతన్య యాత్రలో భాగంగానే చంద్రబాబు విశాఖలో పర్యతిస్తున్నాని బాబు చెబుతున్నా చంద్రబాబు చెబుతున్నా ఈసారి ఆయన విశాఖ టూర్ గతంతో పోలిస్తే ఎంతో భిన్నంగా కనిస్పిస్తోంది.ఒకవేళ చంద్రబాబు పర్యటనకు విశాఖ వాసులు నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.అయినా టీడీపీ మాత్రం అమరావతి విషయాన్ని హైలెట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.

తాను ఎందుకు అమరావతి అంటున్నానో బాబు క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.ఇదే నినాదాన్ని వచ్చే ఎన్నికల వరకు టీడీపీ కొనసాగించినా, ఆశ్చర్యపోనవసరం లేదనే ప్రచారం కూడా సాగుతోంది.

దీనిపై వైసీపీలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube