బీజేపీతో పొత్తు ? చంద్రబాబు ఎత్తులు  

Chandrababu Naidu Want To Tiup With Bjp-chandrababu Naidu,jansena,modi,pawan Kalyan,tdp And Bjp Tiup,tiup With,ys Jagan,ysrcp,బీజేపీతో పొత్తు

మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.గతంలో టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లి మంచి ఫలితాలను సాధించాయి.

Chandrababu Naidu Want To Tiup With BJP-Chandrababu Jansena Modi Pawan Kalyan Tdp And Bjp Tiup Ys Jagan Ysrcp బీజేపీతో పొత్తు

ఆ తరువాత కొద్ది కాలానికే ఈ రెండు పార్టీల మధ్య వైరం ఏర్పడడంతో అప్పటి నుంచి ఈ రెండు పార్టీలు రాజకీయ ప్రత్యర్థులుగామారిపోయాయి.కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ దూకుడు కారణంగా టిడిపి చాలా ఇబ్బందులే ఎదుర్కుంటోంది.

చాలా మంది పార్టీ నాయకులు టీడీపీకి దూరం అవుతూ వస్తున్నారు.అదీ కాకుండా తన వయస్సు మీద పడడం, తన రాజకీయ వారసుడు లోకేష్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలంటే బీజేపీ తో వెళ్లడమే కరెక్ట్ అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.

అదీ కాకుండా మళ్ళీ టీడీపీ బలం పుంజుకుని వైసీపీపై ఆధిపత్యం చెలాయించాలంటే బీజేపీకి దగ్గరవదమే ఏకైక మార్గమని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.దీనికోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ ద్వారా బీజేపీ అగ్ర నాయకులతో మంతనాలు చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారట.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.ఆయన చంద్రబాబు సూచనలతోనే బీజేపీతో కలిసినట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది.

మూడు రాజధానుల విషయంలో బిజెపి కేంద్ర పెద్దలు మాట్లాడకపోవడం, ఏపీ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు కు మద్దతుగా రాజధాని వ్యతిరేకిస్తూ ఉండటం తదితర విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న బాబు బీజేపీకి దగ్గరవడం ద్వారా ఏపీలో వైసీపీ హవాకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు.అయితే గతంలో మోడీ అమిత్ షా ల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా అమిత్ షా తిరుపతి వచ్చిన సందర్భంగా ఆయన కారుపై ఆ పార్టీ నాయకులు రాళ్ల దాడి చేయడం, దానిని చంద్రబాబు సమర్థించిన పరిణామాలపై బిజెపి అగ్రనేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు.

అది కాకుండా అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని మళ్లీ అదే తప్పు చేయడం ఎందుకు అన్న భావనలో వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.

తాజా వార్తలు

Chandrababu Naidu Want To Tiup With Bjp-chandrababu Naidu,jansena,modi,pawan Kalyan,tdp And Bjp Tiup,tiup With,ys Jagan,ysrcp,బీజేపీతో పొత్తు Related....