ఇక్కడ తంటా... అక్కడ మంట ! బాబుని భయపెడుతున్న సర్వేలు     2019-01-06   14:22:40  IST  Sai Mallula

ప్రతి పనికి సర్వేల మీదే ఆధారపడుతూ… పార్టీని , ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఇప్పుడు ఆ సర్వేలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాల ఏమేరకు ఉన్నాయి అనే విషయంపై ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్న బాబు…వాటి మీద నమ్మకం కుదరక ప్రెవేటు సర్వేలు కూడా ఈ మధ్య కాలంలో అనేకం చేయించాడు.

అయితే అన్ని సర్వేల్లోనూ… టీడీపీకి గెలుపు అవకాశాలు కష్టంగానే ఉన్నాయని… ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, నాయకుల మధ్య సమన్వయ లోపం ఇవన్నీ కోలుకోలేని దెబ్బతీశాయని ప్రజలెవ్వరూ ప్రభుత్వాన్ని అంతగా నమ్మడం లేదు అని తేలిపోవడంతో బాబులో కంగారు మొదలయ్యింది. ఆ విషయం ఆయన మాటలు… చేతలను బట్టి చూస్తుంటే అర్ధం అయిపోతోంది.

Chandrababu Naidu Tension Over Private Surveys In AP-BJP Janasena Party Narendra Modi Next PM Pawan Kalyan On AP Elections TDP YCP YS Jagan

Chandrababu Naidu Tension Over Private Surveys In AP

దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో … అనేక జాతీయ మీడియా సంస్థలు, అనేక సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగిపోయాయి. ఈ సర్వేల్లో ప్రధానంగా ఒకే విషయంపై చర్చ మొదలయ్యింది.అదేంటి అంటే…మోడీ మళ్లీ ప్రధాని అవుతాడా? ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందా అనే అంశాలపై చర్చ స్టార్ట్ అయ్యింది.

ఈ అంశాలపై ఎక్కువ సర్వేలు చెబుతున్న మాట ఏమిటంటే.. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుంది అనేది ! అయితే కాస్త సీట్లు తగ్గినా… మళ్లీ ఎన్డీయేకే అధికారం దక్కే అవకాశాలున్నాయని వివిధ సర్వేలు కూడా చెప్తున్నాయి.ఇటీవల మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే ఆ ఉత్సాహం అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం అవుతుందని వివిధ మీడియా సంస్థలు తేల్చేశాయి.

Chandrababu Naidu Tension Over Private Surveys In AP-BJP Janasena Party Narendra Modi Next PM Pawan Kalyan On AP Elections TDP YCP YS Jagan

ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలోనూ… ఇదే తేలిందట. దేశంలో మోదీ హవా ఏ మాత్రం తగ్గలేదని… కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా… మెజార్టీ ప్రజలంతా మళ్ళీ మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పేసారు. అలాగే రాహుల్ గాంధీ కంటే మోదీనే సమర్థుడు అంటూ…. చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఇండియా టుడే వెల్లడించింది.

అలాగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ.. లోక్ సభ ఎన్నికలప్పటికీ మళ్లీ బీజేపీకి అనుకూలత ఉంటుందని ఈ సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి జాతీయ మీడియా సర్వేలు మళ్లీ ఎన్డీయే. అని చెబుతుండడం బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేంద్రంలో కనుక బీజేపీ మళ్ళీ అధికారం చేపడితే కనుక… పరిస్థితి ఎలా ఉంటుందో అందరికంటే బాబు కే ఎక్కువ తెలుసు.