మండలి రద్దు చర్చలో బాబు పాత వీడియోను మంత్రి చూపడతంతో షాక్‌ అయిన తమ్ముళ్లు

ఏపీ మండలి రద్దు చేయాలంటూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అందుకోసం నేడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి చర్చ కూడా జరపడం జరిగింది.

 Chandrababu Naidu Tdp Sasana Mandali-TeluguStop.com

అసెంబ్లీలో ఈ విషయమై వాడీ వేడీ చర్చ జరిగింది.తెలుగు దేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మండలి రద్దు చేయవద్దంటూ డిమాండ్‌ చేస్తుంది.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండలి రద్దును తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడు.ఈ సమయంలో 2004వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు మండలికి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ప్రసారం చేయించాడు.

2004వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి అసెంబ్లీలో మండలి పునరుద్దరణకు సంబంధించిన బిల్లును తీసుకు రావడం జరిగింది.ఆ సమయంలో మండలి వల్ల డబ్బు దండగా, సమయం వృదా తప్ప మరేమీ కాదంటూ వ్యాఖ్యలు చేశాడు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన కార్యకర్తల కోసం ఇప్పుడు మండలిని తీసుకు వస్తున్నాడంటూ అందులో చంద్రబాబు నాయుడు మాట్లాడాడు.అప్పుడు మండలి వద్దంటే వద్దన్న చంద్రబాబు ఇప్పుడేమో మండలి కావాల్సిందే అంటున్నాడంటూ నాని వ్యాఖ్యలు చేశాడు.

బాబు పాత వీడియోకు తెలుగు తమ్ములు తల పట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube