టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఆ మాజీ మంత్రి ? బాబు ఆకస్మిక నిర్ణయం ?

ఏపీలో తెలుగుదేశం పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మితిమీరిన వయోభారం అడ్డంకిగా మారింది.అయినా అదేదీ లెక్కచేయకుండా బాబు ఏడుపదుల వయసులోనూ చురుగ్గానే పార్టీ కార్యక్రమాల్లోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ పాల్గొంటూ పార్టీలోనూ, నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Chandrababu Naidu Tdp Kinjarapu Atchannaidu-TeluguStop.com

ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుండడం, టీడీపీ నాయకులను ఇబ్బందిపెడుతూ, ఇంకా నాలుగేళ్ల పాటు ప్రజా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే అప్పటికి తన వయసు సహకరిస్తుంధో లేదో అన్న అనుమానం అప్పుడే మొదలైనట్టు గా కనిపిస్తోంది.

దీనిలో భాగంగానే పార్టీని తన స్థాయిలో ఉరుకులు పరుగులు పెట్టించే నాయకుడి కోసం చంద్రబాబు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు.

ప్రస్తుతం తనకు అసెంబ్లీలో బయట, అన్ని విధాల సహకరిస్తున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కి ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగిస్తే ఏపీ టీడీపీని ఉరుకులు పరుగులు పెట్టిస్తారని బాబు ఆలోచనగా తెలుస్తోంది.

దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే విషయంలో బాగా వెనకబడి ఉండడం, అసలు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఆయన వ్యవహారాలు చేస్తుండడం వంటి కారణాలు వల్ల ఆయనకు ఏపీ టిడిపీ అధ్యక్ష పదవి కేవలం అలంకారప్రాయంగా ఉంది తప్ప పెద్దగా ఉపయోగం లేదు అనే అభిప్రాయంతో బాబు ఉన్నాడు.

Telugu Babus Sudden, Balayya, Chandrababu, Lokesh, Roja, Ys Jagan, Ysrcp-Latest

అలాగే ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖను దాదాపు ఫైనల్ చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన బలమైన వాయిస్ ఉన్న అచ్చెన్నాయుడు కి టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తే న్యాయం జరిగుతుందని బాబు ఆలోచనగా తెల్సుతోంది.ప్రస్తుతం మూడు రాజధానులపై జగన్ నిర్నయాయం తీసుకున్న దగ్గర నుంచి అచ్చెన్న ఈ విషయంపై పెద్దగా స్పందించలేకపోతున్నాడు.ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఉత్తరాంధ్రలో నెలకొన్న అనిశ్చితి తగ్గుతుందని పార్టీకి పునర్వైభవం వస్తుందని బాబు నమ్ముతుండడంతోనే అచ్చెన్నాయుడు ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube