జ‌గ‌న్ క‌న్నా ముందే జాగ్ర‌త్త ప‌డుతున్న బాబు..!  

chandrababu naidu is moving into safejone before jagan,TDP,YSRCP,jagan mohan reddy,andhra pradesh,chandra babu naidu,safe zone,districts divison,parliament,senior leaders - Telugu Andhra Pradesh, Chandra Babu Naidu, Districts Divison, Jagan Mohan Reddy, Parliament, Safe Zone, Senior Leaders, Tdp, Ysrcp

రాజ‌కీయాల్లో కీల‌క‌మైన వ్యూహ‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు.ఇప్పుడు కూడా అదే దిశ‌గా అడుగులు వేస్తున్నారా?  గ‌త ఏడాది ఎన్నిక‌ల ప‌రాభ‌వం నుంచి పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే.తాజా ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్న నాయ‌కులు ఔన‌నే అంటున్నారు.సీఎం జ‌గ‌న్‌.ఏపీలో ప్ర‌తి పార్ల‌మెంటు స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామ‌ని చెప్పారు.దీనికి ఇంకా కీల‌క‌మైన చ‌ర్య‌లు ప్రారంభించ‌లేదు.

TeluguStop.com - Chandrababu Naidu Strategy Ys Jagan Parliament

అయితే, జిల్లాలు ఏర్పాటు మాత్రం త‌థ్యం.ఇప్ప‌టికే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నేతృత్వంలో ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.జిల్లాలుగా మార్చే ప్ర‌తిపాద‌న ఇంకా ఊపందుకోలేదు.అయితే, రేపు పార్ల‌మెంటు స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే.ప్ర‌తి పార్టీ కూడా వ్యూహాలు మార్చుకుని.

TeluguStop.com - జ‌గ‌న్ క‌న్నా ముందే జాగ్ర‌త్త ప‌డుతున్న బాబు..-Political-Telugu Tollywood Photo Image

ఆయా జిల్లాల్లో నేత‌ల‌ను నియ‌మించుకోవాలి.అప్పుడు ప‌ద‌వుల కేటాయింపు విష‌యంలో సీనియ‌ర్లు, ఇప్ప‌టికే ఉన్న వారికి మ‌ధ్య విభేదాలు వివాదాలు తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ వంటి పార్టీకి మరింత ప్ర‌తిబంధ‌కంగా ఉండే అవ‌కాశం ఉంది.దీనిని ముందుగానే గుర్తించారో.

ఏమో చంద్ర‌బాబు.ఇంకా పార్ల‌మెంటు స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే ప్ర‌తిపాద‌న‌లు పూర్తిగా.

ముందుకు రాక‌పోయినా. రాజ‌కీయ క‌మిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

ఈ నెల 27నే పార్ల‌మెంటు స్థానం కేంద్రంగా క‌మిటీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని. సీనియ‌ర్లు మాజీ మంత్రుల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.అయితే.దీనిని ఇప్ప‌టికిప్పుడు ఎందుకు తెర‌మీదికి తెచ్చారంటే.రేపు జిల్లాల ఏర్పాటు జ‌రిగిపోయి.పార్టీ క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం, లేదా.

అప్ప‌టికే ఉన్న జిల్లాల క‌మిటీల‌ను ర‌ద్దు చేయ‌డం అనే ప్ర‌క్రియ త‌ల‌కు మించిన భారంగా మారుతుంది.ఈ నేప‌థ్యంలో ఇప్పుడే.

పార్ల‌మెంటు క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా.మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని బాబు భావించి ఉంటార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.
మొత్తానికి పార్ల‌మెంటు స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేసే విష‌యంలోను, క‌మిటీల‌ను నియ‌మించే విష‌యంలోను. వైసీపీ అధినేత‌, బీజేపీ, జ‌న‌సేన‌ల కంటే కూడా టీడీపీ ముందుంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌మిటీలు ఏర్పాటు చేస్తారు.స‌రే.

పార్టీ ఎలా పుంజుకుంటుందో చూడాలి.

#Safe Zone #Andhra Pradesh #Ysrcp #Senior Leaders #Parliament

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Naidu Strategy Ys Jagan Parliament Related Telugu News,Photos/Pics,Images..