ఆయన దూకుడికి బ్రేకుల్లేవా ? బాబు ప్రశ్న ఇదేనా ?

ఏపీ సీఎం జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.ఒకవైపు ప్రభుత్వ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ, ఆర్థికపరమైన భారీ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటూ తిరుగులేని నాయకుడిగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

 Chandrababu Naidu Straight Questen To Ys Jagan-TeluguStop.com

అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రతిపక్షాలను బలహీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు.ఇదే ఇప్పుడు జగన్ రాజకీయ ప్రత్యర్ధులకు మింగుడు పడడం లేదు.

జగన్ ప్రభుత్వం, పార్టీ ఇలా రెండు పడవల్లోనూ సమర్థవంతంగా ముందుకు ఎలా వెళ్లగలుగుతున్నాడు అనే ఆలోచన వారికి నిద్ర పట్టనివ్వడంలేదు.ఏపీ బిజెపి నాయకులు జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలుచేస్తున్నా ఆయన లెక్కచేయకుండా కేంద్ర బిజెపి పెద్దలతో సఖ్యత పాటిస్తూ వస్తున్నాడు.

మరోవైపు తనమీద కేసులు ఉన్నా, వాటిని బూచిగా చూపించి బిజెపి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.జగన్ టార్గెట్ అంతా ఇప్పుడు టీడీపీ అనే విషయం బాగా అర్ధం అవుతోంది.

ముఖ్యంగా టీడీపీ నాయకులను జగన్ ముందుగా టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ పార్టీ మారడం వెనుక కూడా ఇదే రీజన్ అని అంతా అభిప్రాయపడుతున్నారు.

ఆయన మీద ఉన్నకేసులే కారణం అని తెలుస్తోంది.అలాగే విజయవాడ యూత్ నాయకుడు దేవినేని అవినాష్ అనుచరుల మీద లెక్కలేనన్ని కేసులు, భూ వివాదాలు ఉండడం, అవినాష్ కు విజయవాడ భారీగా ఆస్తులు ఉన్న నేపథ్యంలో పార్టీ మారాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందట.

ఈ కారణాలతో వారు తప్పని పరిస్థితుల్లో పార్టీ మారారని బాబు కి అర్ధం అయ్యింది.ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురించి చెప్పుకుంటే జగన్ బాబుకు చాలా తేడా కనిపిస్తుంది.

చంద్రబాబు రాజకీయంగా ఆయనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, భవిష్యత్తులో వాటి ఉపయోగం తమకు ఉంటుందేమో అన్న ఆలోచనతో ఉంటారు.అందుకే తనను విమర్శించిన అమర్నాథ్ రెడ్డి, భూమా నాగిరెడ్డి పార్టీలో చేర్చుకున్నారు.

Telugu Andhra, Chandrababu, Jr Ntr, Lokesh, Varla Ramaiah, Ys Jagan, Ysrcp-Telug

ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చారు.గతంలో వల్లభనేని వంశీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ ఓదార్పు యాత్రలో కలిసి హత్తుకోవడంపై విమర్శలు వచ్చినా చంద్రబాబు స్పందించలేదు.అది పెద్ద విషయం కాదు అన్నట్టుగా లైట్ తీసుకున్నారు.అదే జగన్ విషయానికి వస్థే అటువంటి వ్యవహారాలు ఆయనకు నచ్చవు.ఎవరైనా తనమీద విమర్శలు చేసినా ఊరుకునే రకం కాదు.వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో జగన్ కు బాగా తెలుసు.

ఈ విషయంలో ధర్మాన ప్రసాదరావును ఉదాహరణగా తీసుకుంటే ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉండగా జగన్ పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు.ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు.

ఉత్తరాంధ్రలో కీలక నాయకుడైన ధర్మానకు మంత్రి పదవి దక్కలేదు.ప్రస్తుతం టీడీపీలో ఉన్న కీలక నాయకుల బలహీనతను ఆధారంగా చేసుకొని జగన్ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారి సంఖ్య తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.అసలు ఏ అండ చూసుకుని జగన్ ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నాడు అనే విషయం బాబుకు అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube