బాబూ... ఇంత హడావుడి ఎందుకో...? అందుకేనా ...?

ఏపీలో ఎన్నికల తంతు మొదలయిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కంగారు పడుతున్నాడు.ఒక పక్క తన రాజకీయ ప్రత్యర్థులు రోజు రోజుకు రాజకీయంగా బలం పుంజుకోవడంతో పాటు .

 Chandrababu Naidu Starts Two Immidiate Projects In Amaravathi-TeluguStop.com

కొత్త శత్రువులు కూడా… దానిమీద ఎదురుదాడి చేసేందుకు సిద్ధం అవుతుండడంతో… బాబు లో కొత్త భయం పట్టుకుంది.తెలంగాణాలో రాజకీయంగా ఎదురుదెబ్బ తగలడంతో పాటు… టీఆర్ఎస్ పార్టీతో వైరం మరింత పెరిగింది.

ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ కి సపోర్ట్ గా ప్రచారం చేసేందుకు కేసీఆర్… ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా సిద్ధం అవుతున్నారు.దీంతో పాటు… ఎన్నికల షెడ్యూల్ కి మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇప్పుడు బాబు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పదునుపెడుతున్నాడు.

కొన్ని కొన్ని భారీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మొదలుపెట్టడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.

చంద్రబాబు ఉన్నట్టుండి ఇంత అకస్మాత్తుగా… రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు చేయటంలో వెనుక కారణం ఏంటి అనే సందేహం అందరిలోనూ ఉంది.అమరావతిలో సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణంతో పాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒకేరోజు శంకుస్ధాపనలు చేశారు.సచివాలయం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు కావాలి.

అదే విధంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ 18 వేల కోట్లు కావాలి.రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో… అంత భారీ బడ్జెట్ కేటాయించే పరిస్థితి లేదు.

అలాగే ఎన్నికల సమయం కూడా దగ్గరకు వచ్చేసిన నేపథ్యంలో … ఆ ప్రాజెక్ట్స్ పనులు సాగుతాయా అనే అనుమానం కలుగుతోంది.ఒకసారి నోటిఫికేషన్ విడుదలైతే ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, కొత్త పథకాలు ప్రకటించేందుకు లేదు.

ఆ విషయాన్ని పక్కనుంచితే ఇఫుడు శంకుస్ధాపనలు చేసిన క్షేత్రస్ధాయిలో పనులు మొదలయ్యేందుకు కనీసం నెల రోజులు పడుతుంది.అంటే ఒకసారి నోటిఫికేషన్ విడుదలైందంటే ఆటోమేటిక్ గా… అన్ని పనులు వేగం తగ్గిపోతాయి.

చంద్రబాబు శంకుస్థాపన చేసిన అన్ని ప్రాజెక్ట్స్ అతి భారీ ప్రాజెక్ట్స్.ఇటువంటి పరిస్థితుల్లో… సచివాలయం, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ముందుకు సాగే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.అందుకనే పనులు జరుగుతున్నట్లుగా చంద్రబాబు ఏదో హడావుడి చేసి ప్రజల్లో ఏదో చేసేస్తున్నాము అనే భావన కల్పించే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తోంది.బాబు ఇంత హడావుడిగా శంకుస్థాపనలు చేసిన అన్ని పనులు పూర్తికావాలంటే… తప్పనిసరిగా టీడీపీ అధికారంలోకి రావాలనే కొత్త మెలిక పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.

అంతే కాదు వైసీపీకి కనుక మీరు ఓటు వేస్తే … ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయి… రాష్ట్రం వెనకబడిపోతోంది అనే కొత్త రాగం బాబు అందుకునే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube