అది భావితరాలకు అన్యాయం

ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.మండలిలో లొల్లి లేకుంటే ఇప్పటికే ఏపీకి మూడు రాజధానులు అయ్యేవి.

 Chandrababu Naidu Spekaing About Three Capitals Ap-TeluguStop.com

ప్రస్తుతానికి కోర్టు కేసు మరియు మండలిలో బిల్లు సెలక్షన్‌ కమిటీకి వెళ్లిన కారణంగా మూడు రాజధానుల ఏర్పాటు ఆగింది.కాని జగన్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు.

నేడు కాకుంటే రేపు అయినా కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటూ పట్టుదలగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో రాజధాని విషయమై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడకుంటే భావి తరాలకు అన్యాయం చేసిన వారు అవుతారు.

వచ్చే తరాలు ఎప్పటికి మిమ్మల్ని క్షమించవు అన్నాడు.మూడు రాజధానుల విషయంలో ఏ ఒక్కరు కూడా సానుకూలంగా లేరని, ప్రభుత్వం ఒంటెద్దు పోకడతోనే ఇలాంటి పనులు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

జాతీయ మీడియాలో కూడా రాజధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వస్తుంది.జాతీయ మీడియాలో వార్తలను అయినా నమ్మే అవకాశం లేదా అంటూ బాబు ప్రశ్నించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube