జనసేన పై బాబు నోరు జారాడా ...? లేక చీకటి ఒప్పందమా ...?

రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా … ముందు వెనుకా చూసుకుని మాట్లాడాలి.పొరపాటున నోరు జారితే ఇక అంతే సంగతులు వాటికి పెడర్ధాలు తీస్తూ… అనేక ఉహాగానాలు బయలుదేరుతుంటాయి.

 Chandrababu Naidu Sensational Comments On Janasena Party1-TeluguStop.com

ఇక ఇప్పుడు తెలంగాణా విషయానికి వస్తే… ఇక్కడ రాజకీయ వేడి సెగలు కక్కుతోంది.ప్రత్యర్థులను తమ మాటల తూటాలతో… ఇబ్బంది పెడుతూ… ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రయత్నిస్తుంటారు.

ఈ విషయాలన్నీ పక్కనపెడితే… మహాకూటమి ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు.జనసేన కార్యకర్తలంతా … టీడీపీతో కలిసి సైనికుల్లా పనిచేసి టీఆర్ఎస్‌ను ఓడించాలని బాబు పిలుపునివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచెయ్యడమే కాకుండా ఆలోచనలో కూడా పడేసింది.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ- జనసేన పార్టీలు ఉప్పు నిప్పులా ఉన్నాయి.ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ… ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు చూస్తున్నారు.ఒకప్పుడు టీడీపీ తో జనసేన అధినేత పవన్ చనువుగా ఉండేవాడు… టీడీపీని పొగడ్తల వర్షంలో తడిపేస్తూ ఉండేవాడు.ఇక అదే స్థాయిలో చంద్రబాబు .లోకేష్ తో సహా టీడీపీ నేతలందరూ పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉండేవారు.కానీ అనూహ్యంగా వారి మధ్య భేదాలు వచ్చాయి.

దీంతో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఈ సమయంలో … ఖమ్మం మహాకూటమి మీటింగ్ లో బాబు జనసేన పార్టీ తమతోనే ఉంది అన్నట్టుగా మాట్లాడడం కొత్త డౌట్లను కలిగిస్తోంది.

బాబు మాత్రం జనసేన విషయంలో తొందరపడి మాట్లాడారో లేక నిజంగానే మాట్లాడారో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

ఆ మీటింగ్ లో ముందుగా….జనసేన కార్యకర్తలు అంటూ మాట్లాడిన చంద్రబాబు రెండోసారి కూడా తెలంగాణ జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.ఈ వ్యాఖ్యలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు తన మాజీ మిత్రుడైన పనవ్ కల్యాణ్ పార్టీని ఇంకా మర్చిపోవడం లేదంటూ నెటిజన్ లు సెటైర్లు వేస్తున్నారు.ఇక ఈ విషయంలో ఎలా స్పందించాలో తెలియక జనసైనికులు సతమతం అవుతున్నారు.

బాబు వ్యాఖ్యలు సంచలనం సృష్టించి ఇంత వైరల్ అయినా అటు జనసేన అధినేత నుంచి దీనిపై స్పష్టమైన ఖండన కానీ … ప్రెస్ నోట్ కానీ విడుదల కాకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube