పిచ్చి తుగ్లక్ పాలన పై ప్రజలు నోరు మెదపకపోతే అన్నీ మూతపడతాయి అంటున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన ఆయన మొదటిగా ప్రకాశం జిల్లా నుంచి మొదలు పెట్టారు.

 Chandrababu Naidu Sensational Comments On Ap Cm Jagan-TeluguStop.com

ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరపబోతున్నారు.ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్న దానిపై ప్రజలకు వివరించనున్నారు.

ప్రభుత్వం ఏర్పడిన ఈ తొమ్మిది నెలల్లో తొమ్మిది రద్దులు,తొమ్మిది మోసాలు,తొమ్మిది భారాలు అంటూ ఒక ఎజెండాను కూడా తయారు చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరు నెలల వరకు ఏమి మాట్లాడం అని చెప్పాం.

చెప్పినట్లుగానే సైలెంట్ గా ఉన్నాం.కానీ రాష్ట్ర భవిష్యత్తు ఈ పిచ్చి తుగ్లక్ చేతిలో పడిందని, ఆయన ఏరోజు ఏమి చేస్తాడో ఆయనకే తెలియదు అని బాబు వ్యాఖ్యానించారు.

అలానే టీడీపీకి, నాకు అధికారం కొత్తేమీ కాదని, నేను ఎప్పుడు పోటీ చేసినా ప్రజల కోసమే కానీ ముఖ్యమంత్రి పదవి కోసం కాదని.దీన్ని అందరూ గమనించాలి అని కోరారు.

అలానే గతంలో ఏపీ ఎలా ఉంది? ఈ తొమ్మిది నెలల్లో ఏపీ ఎలా ఉందో? ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని ప్రజలకు ఉపయోగపడే అన్నా కాంటీన్లను కూడా మూసి వేశారు.ఇప్పుడు కూడా ప్రజలు నోరు మెదపక పోతే ఇక అన్నీ మూతపడతాయి.

ఏ కార్యక్రమం చేసినా అన్నీ ఇబ్బందులు పెడుతున్నారు.గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగె ఇబ్బందులు పెడితే ముఖ్యమంత్రి జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలు చేసేవారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.అలానే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ లు అందరికి ఇచ్చేవాళ్ళం,కానీ ఇప్పుడు అర్హులు అయినవారికె పెన్షన్ లు ఇస్తాం అంటూ పేద వారి ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube