పవన్ పై జగన్ కక్ష సాధిస్తున్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..?

ఏపీలో రెండు రోజుల క్రితం విడుదలైన వకీల్ సాబ్ సినిమా విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని వకీల్ సాబ్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సూచనలు చేసింది.

 Chandrababu Naidu Sensational Comments About Cm Jagan-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పాల్గొన్న చంద్రబాబు వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ పై జగన్ కక్ష సాధిస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు.

 Chandrababu Naidu Sensational Comments About Cm Jagan-పవన్ పై జగన్ కక్ష సాధిస్తున్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగన్ సర్కార్ చేస్తున్న అరాచకాలను పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వల్లే వకీల్ సాబ్ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.స్టార్ హీరోల సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ షోలకు అనుమతులు ఇస్తుంటాయని కానీ జగన్ మాత్రం రాజకీయపరమైన కక్షల వల్లే వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు.

సీఎం జగన్ ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు.పవన్ ను ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఆలోచనతోనే జగన్ ఈ విధంగా చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తోందని పవన్ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు చేయడం వల్లే జగన్ పవన్ పై కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Telugu Chandrababu, Cm Jagan, Sensational Comments, Tirupati-Movie

జగన్ సర్కార్ పాలనపై కూడా విమర్శలు చేస్తూ చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.వకీల్ సాబ్ సినిమాకు జగన్ కావాలని ఆటంకాలు సృష్టిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.చంద్రబాబు కామెంట్లపై జగన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి జగన్ హాజరు కావాల్సి ఉండగా కరోనా విజృంభణ వల్ల జగన్ ప్రచారానికి రావడానికి సిద్ధపడలేదు.ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుందో చూడాల్సి ఉంది.

#CM Jagan #Tirupati #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు