జగన్ ప్రభుత్వ వేధింపులే కోడెల మరణించడానికి కారణం అంటూ మండిపడ్డ బాబు  

Chandrababu Naidu Says Ys Jagan Government Is The Reason-chandrababu Naidu,ex Speaker,kodela Siva Prasad,modi,tdp,ys Jagan,ysrcp

టీడీపీ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఆయన మృతి పై పలు భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.కొందరు ఆయనను సొంత కుమారుడే చంపినట్లు ఆరోపిస్తుండగా,మరికొందరు ఆయన ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని, కాదు కాదు ఆయన ఆత్మహత్య చేసుకొనే క్రమంలోనే గుండె పోటు కు కూడా గురికావడం తో మృతి చెందారు అంటూ భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.

Chandrababu Naidu Says Ys Jagan Government Is The Reason-chandrababu Naidu,ex Speaker,kodela Siva Prasad,modi,tdp,ys Jagan,ysrcp-Chandrababu Naidu Says YS Jagan Government Is The Reason-Chandrababu Ex Speaker Kodela Siva Prasad Modi Tdp Ys Ysrcp

అయితే ఏదైనా గానీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల కుటుంబం తీవ్ర అవమానాలు ఎదుర్కొంటుంది అని ఆయన మృతి కి పూర్తిగా ప్రభుత్వం దే భాద్యత అంటూ పలువురు టీడీపీ నేతలతో పాటు కోడెల కుటుంబసభ్యులు కూడా ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం,టీడీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Chandrababu Naidu Says Ys Jagan Government Is The Reason-chandrababu Naidu,ex Speaker,kodela Siva Prasad,modi,tdp,ys Jagan,ysrcp-Chandrababu Naidu Says YS Jagan Government Is The Reason-Chandrababu Ex Speaker Kodela Siva Prasad Modi Tdp Ys Ysrcp

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు.టీడీపీ పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి మాజీ స్పీకర్‌ కోడెలపై ఫర్నీచర్‌ దొంగతనం మోపి మానసిక క్షోభకు గురి చేశారంటూ మండిపడ్డారు.మరోపక్క కోడెలను సొంత కొడుకే చంపేశాడంటూ పుకార్లు సృష్టించి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ బాబు ఆరోపించారు.

కోడెల మృతి పట్ల.రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా కోడెలకు సంతాపాలు ప్రకటించాలని సూచించారు.ఇలాంటి టెర్రరిస్టు ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు.పల్నాటి పులిగా పేరొందిన కోడెలను ఆత్మహత్యకు ఉసిగొలిపిన కారణాలను ప్రజలకు తెలియజేయాలంటూ బాబు సూచించారు.