కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డిని అభినందించిన చంద్రబాబు..!

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు.ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆయన పూనుకున్నారు.అనంతరపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో పురాతన ఆలయం ఉంది.1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఆలయాన్ని మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పునర్నిర్మించారు. దీనిలో గ్రామస్థుల సహకారం కూడా ఉందని తెలుస్తుంది.రఘువీరా రెడ్డి పునర్ నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ నెల 19 అనగా శనివారం శాస్త్రోక్తంగా పున ప్రారంభిస్తున్నారు.

 Chandrababu Naidu Praises Former Minister Raghuveera Reddy-TeluguStop.com

ఈ సందర్భంగా రఘువీరారెడ్డిని అభినందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.ప్రాచీనమైన ఎంతో విశిష్టత కలిగిన ఆలయాల పునర్ నిర్మాణ బాధ్యత స్వీకరించిన రఘువీరాకు నీలకంఠాపురం గ్రామస్థులకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని వీడియో మెసేజ్ పంపించారు చంద్రబాబు.

1200 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టిన వారికి తన శుభాకాంక్షలు తెలిపారు.ఏపీ, కర్ణాటక ప్రజలకు అందుబాటులో ఈ ఆలయం ఉంటుందని అన్నారు.

 Chandrababu Naidu Praises Former Minister Raghuveera Reddy-కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డిని అభినందించిన చంద్రబాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నెల 19 నుండి నాలుగు రోజుల పాటు నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద పవిత్రమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని.ఇది మంచి సంకల్పం అని చంద్రబాబు అన్నారు.

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నీలకంఠేశ్వర స్వామికి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలుస్తుంది.

#Old Temple #Praises #Former Minister

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు