దేవినేని ని భూజం తట్టి మరీ మెచ్చుకున్న చంద్రబాబు

ఎప్పుడైతే ఏపీ – తెలంగాణా విదిపోయాయో అప్పటి నుంచీ ప్రతీ సారీ ప్రతికూల పరిస్థితులు ఎదురు అవుతూనే ఉన్నాయి ఏపీ కి.అలాంటి ప్రతికూల పరిస్థితి లో రాష్ట్రాన్ని పాలించడం అంటే కత్తి మీద సామే.

 Chandrababu Naidu Praises Devineni-TeluguStop.com

అంతటి పని నెత్తిన వేసుకున్న చంద్రబాబు కి మొదటి నుంచీ ఎదో ఒక ఇబ్బంది ఎదురు అవుతూనే ఉంది.చుట్టూ ఇబ్బందికర పరిస్థితులతో పాటు ఆర్ధికంగా కూడా రాష్ట్రం కష్టాల్లో ఉంది.

పక్కన ఉన్న సహచరుల మీద విసుక్కోవడం ఎక్కువగా చేస్తున్న చంద్రబాబు ఒకరిని పొగడ్తలతో ముంచెత్తడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు.క్యాబినెట్ సమావేశం లో హరీష్ రావు కి సరిగ్గా సమాధానం చెప్పావు అంటూ దేవినేని ఉమా ని మెచ్చుకున్నారు చంద్రాబాబు.

ఏపీ.తెలంగాణ రాష్ట్రాల మధ్య నడుస్తున్న పంచాయితీల్లో భాగంగా ఇటీవల కేంద్రంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు ధీటుగా ఏపీ మంత్రి దేవినేని ఉమ వాదనలు వినిపించటం.ఏపీ వైఖరిని స్పష్టం చేయటంతో పాటు.తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ.తొండి వాదంతో వెళుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన వైనాన్ని చంద్రబాబు మెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.డిల్లీ ఎపిసోడ్ ని సమర్ధవంతంగా పూర్తి చేసిన దేవినేని ని చూసి ఇతరులు నేర్చుకోవాలి అని వ్యాఖ్య కూడా చేసారట.

భుజం తట్టి మరీ చంద్రబాబు మెచ్చుకోవడం అంటే మామూలు విషయమా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube