చంద్రబాబు " డబుల్ గేర్ ".. సక్సస్ అవుతుందా ?

ఏపీలో వచ్చే ఎన్నికలు టీడీపీకి( TDP ) చావో రేవో లాంటివి అనే సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఆయన ఏపీలో రచిస్తున్న వ్యూహాలన్నీ గెలుపే లక్ష్యంగా ఉన్నాయి.

 Chandrababu Naidu Political Strategy Ap And Telangana, Chandrababu Naidu, Ap Pol-TeluguStop.com

పొత్తుల అంశమైనా, మేనిఫెస్టో కూర్పు అయిన.టికెట్ల కేటాయింపైనా ఇలా ప్రతిదీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు చంద్రబాబు.

అలాగే పర్యటనలు, బహిరంగ సభలు నిరవహిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.మరి ఇంత బిజీ బిజీగా గడుపుతున్నప్పటికి చంద్రబాబు దృష్టి తెలంగాణపై కూడా గట్టిగానే పడింది.

తెలంగాణలో టీడీపీకి కొన్ని నియోజిక వర్గాలలో బలమైన ఓటు బ్యాంకు ఉంది.

Telugu Amith Shah, Ap, Chandrababu, Jp Nadda, Tealangana-Politics

2014, 2018 ఎన్నికలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది.2014 ఎన్నికల్లో 15 సీట్లు సాధించిన టీడీపీ, 2018 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.దీనికి ప్రధాన కారణం టీడీపీ ఏపీపైనే ఎక్కువ ఫోకస్ చేయడం.

అందువల్ల గత ఎన్నికల్లో జరిగిన తప్పుడు మళ్ళీ జరగకుండా తెలంగాణలో కూడా తిరిగి రేస్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు( Chandrababu Naidu ), రాష్ట్రంలో సమయం దొరికినప్పుడల్లా పర్యటనలు బహిరంగ సభలు నిర్వహిస్తు టీడీపీ నేతలలో జోష్ నింపుతున్నారు అధినేత చంద్రబాబు.ఇక తాజాగా టి టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు కూడా.

ఎన్నికలు మరో ఐదు నెలలో జరుగుతుండడంతో భవిష్యత్ కార్యాచరణపై టిటీడీపీనేతలకు దిశ నిర్దేశం చేసి సమాయత్తం చేస్తున్నారు.

Telugu Amith Shah, Ap, Chandrababu, Jp Nadda, Tealangana-Politics

కాగా ఏపీలో ప్రస్తుతం పొత్తుల కోసం పాకులాడుతున్న టీడీపీ.తెలంగాణలో కూడా అదే దారిని ఎంచుకుంటుందా అనేది అంతుచిక్కని ప్రశ్నే.ఎందుకంటే గత వారం రోజులుగా టీడీపీ బీజేపీ ( BJP )మద్య పొత్తుకు సంబంధించిన వార్తలు తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఏపీలో ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఖాయమే అని భావిస్తున్నప్పటికి, తెలంగాణలో మాత్రం రెండు పార్టీల పొత్తు లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో ఒంటరిగానే టీడీపీని బరిలో దించుతారా అనేది చూడాలి.

మొత్తానికి అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ అధికారం కోసం బాబు డబుల్ గేర్ లో దూసుకుపోతున్నారు.మరి రెండు రాష్ట్రాలలో టీడీపీకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube