ఆ బిల్లు టీడీపీకి 'కాపు' కాస్తుందా ...? ఈ చిక్కుముడులేంటి...?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ సామజిక వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.ప్రస్తుత తరుణంలో ప్రతి సామజిక వర్గం మద్దతు పార్టీలకు అత్యవసరం కావడంతో… ఇప్పుడు ఆయా సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ విషయంలో అధికార పార్టీ టీడీపీ అలెర్ట్ గానే ఉంది.

 Chandrababu Naidu Passes Kapu Bill Reservation In Assembly-TeluguStop.com

ఇప్పటికే ఏపీ ఓటర్లలో మెజార్టీ భాగంలో ఉన్న బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జయహో బీసీ కార్యక్రమం నిర్వహించించి మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది.అలాగే… మరో కీలక సామజిక వర్గం అయిన కాపులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.ఇప్పటికే జనసేన పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ ఆ సామాజికవర్గం ఓట్లను తన్నుకుపోయే పరిస్థితి ఉండడంతో….బాబు కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చాడు.

ఈ నేపథ్యంలోనే….ఆర్ధికంగా… వెనుకబడిన వర్గాల వారి కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది.ఈ మేరకు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది.ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భాగంగా కల్పిస్తారు.మిగిలిన వారికి ఐదు శాతం ఇస్తారు.

రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం ఉంటుంది.

ఈ బిల్లును చర్చించి ఆమోదించడం ఒక్కటే మిగిలి ఉంది.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేసి.

ఆ కమిషన్ నివేదిక ఆధారంగా.అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపారు.

కేంద్ర ప్రభుత్వంతొమ్మిదో షెడ్యూల్ లో కనుక ఆ బిల్లును చేరిస్తే కాపులకు రిజర్వేషన్లు వచ్చినట్లే.కానీ కేంద్రం మాత్రం ఆ బిల్లును పెండింగ్ లో పెట్టేసింది.

అసలు ఇప్పటికే కేంద్రానికి రిజర్వేషన్ బిల్లు కోసం అనేక అనేక రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి.అయితే ఆ విజ్ఞప్తులన్నిటినీ కేంద్రం పక్కనెపెట్టిసి కొత్త ఆర్ధికంగా వెనకబడిన వర్గాల కోసం అంటూ… బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేసింది.అయితే అనూహ్యంగా… అన్ని పార్టీలు దీనికి మద్దతివ్వడంతో సులువుగానే ఆమోదం పొందింది.అయితే.రిజర్వేషన్ల తీర్మానాలు చేసిన రాష్ట్రాల్లో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తమయింది.ఏపీ ఈ విషయానికి వస్తే… ఆ పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.అయితే ఇక్కడ బీజేపీ ఏపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉంది.ఎందుకంటే… కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు యధాతధంగా ఆమోదించాలి తప్ప మార్పు చేర్పులు చేయకూడదని , అలా చేస్తే….ఆ బిల్లు చెల్లదని కేంద్రం వాదిస్తోంది.

కానీ.

కేంద్రం చేసిన చట్టం.రిజర్వేషన్లు అమలు.

కేంద్రానికే పరిమితం.కేంద్రం భర్తీ చేసే ఉద్యోగాలు, విద్యాసంస్థలల్లో సీట్ల భర్తీ కోసం మాత్రమే అది చెల్లుబాటవుతుంది.

రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.దానికి తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.

అంటే.ఏపీలోని ఉద్యోగ, విద్యా ఇతర అంశాల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.

ప్రభుత్వం ఓ పద్దతి ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.ఈ క్రమంలో మార్పులు చేసుకోవచ్చని నిపుణులు కొంతమంది సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube