'చంద్రగిరి'చరిత్రలో 'టీడీపీ' కి స్థానం లేదా..?     2018-09-17   13:26:58  IST  Bhanu C

ఏపీ లో తిరుగులేని నేతగా అధికార పార్టీ అధినేతగా..ఏపీ ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలుగుతున్న చంద్రబాబు తన సుధీర్గమైన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే సంపాదించుకోవాలి అనేది చంద్రబాబు మొండి పట్టుదల అయితే చంద్రబాబు మొండి తనం తన సొంత నియోజకవర్గంలోనే గత కొంతకాలంగా ఓడిపోతోంది..బాబు కి కొరకరాని కొయ్యగా మారిపోయిన ఆ స్థానం..తన సొంత జిల్లా చిత్తూరులో ఉండటం గమనార్హం.

ఇంతకీ బాబు ఖాతాలోకి రాకుండా ముప్పుతిప్పలు పెడుతున్న ఆ నియోజకవర్గం “చంద్రగిరి”..తన సొంత జిల్లా అందులోనూ సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఇప్పటి వరకూ చంద్రబాబు ఖాతా తెరవలేక పోయారు అంటే అక్కడ టీడీపీ కి ఎంతటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు..అయితే చంద్రబాబు అభివృద్ధి విషయంలో సైతం ఆ నియోజకవర్గానికి అన్యాయం చేయలేదు..ప్రత్యేకంగా ఎంతో అభివృద్ధి చేసినా సరే అక్కడి ప్రజలు టీడీపీ ని కనికరించడం లేదు. చంద్రబాబు ని సైతం ఒకానొక సమయంలో చంద్రగిరి ప్రజలు ఓడించిన చరిత్ర ఉంది..చంద్రగిరిలో ఇప్పటి వరకూ గెలుపొందిన వారి వివరాలని పరిసేలిస్తే.

చంద్రగిరి చరిత్రలో టీడీపీ నెగ్గిన సందర్భాలు 1983లో తెలుగుదేశం గాలి వీయడంతో అక్కడి రైతుల నేత వెంకట్రామ నాయుడు అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన చంద్రబాబు పై పదివేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇది గడించిన రెండేళ్ళ తరువాత అంటే 1985లో టిడిపి అభ్యర్థి వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై విజయం సాధించినా చావో రేవో అనేట్టుగా తెలుగుదేశానికి విజయం వచ్చింది ఇక అక్కడినుంచీ మొదలు పెడితే..

Chandrababu Naidu Over Think about TDP Candidate From Chandragiri-Chandrababu Naidu,Elections In Ap. Ap Politics Updates,Galla Arunakumari,TDP

1989, 1999, 2004, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గల్లా అరుణ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు..అయితే విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో అంటే 2014లో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన గల్లా అరుణఘోరాతి ఘోరంగా ఓడిపోయారు..అయితే ఈ గెలుపు ఓటమిలు ఒకసారి పరిశీలిస్తే.. “చంద్రగిరి” నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్దులకి కాకుండా టీడీపీ యేతర వ్యక్తులకి మాత్రమే పట్టం కడుతూ వచ్చారని చెప్పడంలో సందేహం లేదనే చెప్పాలి..అందుకే చంద్రబాబు ఎంతో తెలివిగా 1989లో లో చంద్రగిరి నుంచీ కాకుండా కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అయితే వచ్చే 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున చెవిరెడ్డి ని డీ కొట్టగలిగే అభ్యర్ధులు లేకపోవడంతో బాబుకి చంద్రగిరి గెలుపు పై బెంగ పట్టుకుంది అంటున్నారు విశ్లేషకులు.