వారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి జరుగబోతున్న విషయం తెల్సిందే.ఈ సమావేశాల్లో తెలుగు దేశం పార్టీ చాలా యాక్టివ్‌గా ఉండాలని పలు విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అస్త్రలను సిద్దం చేసుకుంటుంది.

 Chandrababu Naidu Meeting With Tdp Leaders-TeluguStop.com

ఈ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై టీడీఎల్పీ నేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.ఈ భేటీలో కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.

వారిలో కొందరు ఇప్పటికే టీడీపీ దూరంగా ఉంటుండగా మరి కొందరు వ్యక్తిగత కారణాలు చెబుతూ టీడీఎల్పీ సమావేశంకు డుమ్మా కొట్టారు.వారు రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు.

ఇక తెలుగు దేశం పార్టీకి గుడ్‌ బై చెప్పేసిన వంశీ మరియు మద్దాలి గిరిలను ఇరికించే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ను జారీ చేయడం జరిగింది.ఆ విప్‌ కిందకు వంశీ మరియు గిరిలు కూడా వస్తారు.

అసెంబ్లీలో ఏదైనా ఓటింగ్‌ పెట్టిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా విప్‌కు అనుకూలంగా ఓట్లు వేయాల్సి ఉంటుంది.అలా ఓట్లు వేయకుంటే మాత్రం పార్టీ ఫిర్యాదు మేరకు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది.

అందుకే అసెంబ్లీ సమావేశాల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే తెలుగు దేశం పార్టీకి దూరం అవ్వాలని భావిస్తున్నారో వారికి షాక్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube