ఏంటమ్మా మీ ప్రాబ్లెమ్ : అసంతృప్తులపై బాబు దృష్టి  

Chandrababu Naidu Meeting With Kappu Leaders And Party Workers-

తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి ముదిరిపోతుంది.ఒకవైపు కేంద్ర అధికార పార్టీ బిజెపి టిడిపి కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయడంతో పాటు, రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీకి బలమైన పునాదులు వేసేందుకు ప్లాన్ చేస్తోంది.మరో వైపు చూస్తే వైసిపి జోష్ రోజురోజుకు పెరుగుతూ వెళ్తోంది.అదీకాకుండా టీడీపీ నాయకుల మీద ప్రతీకార దాడులు వివిధ కోణాల్లో జరిగే ఛాన్స్ ఉండడంతో ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.

Chandrababu Naidu Meeting With Kappu Leaders And Party Workers--Chandrababu Naidu Meeting With Kappu Leaders And Party Workers-

అందుకే ముందు జాగ్రత్తగా పార్టీని వీడేందుకు చాలామంది నాయకులు సిద్ధం అవుతున్నారు.

Chandrababu Naidu Meeting With Kappu Leaders And Party Workers--Chandrababu Naidu Meeting With Kappu Leaders And Party Workers-

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు.అలాగే గుంటూరు జిలాకు చెందిన ఎమ్యెల్యే అనగాని సత్య ప్రసాద్ బీజేపీ లో చేరబోతున్నారు.ఆయనే కాకుండా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.ఈ పరిస్థితులను చూస్తున్న చంద్రబాబు కాస్త ఆలస్యంగానైనా స్పందించారు.ఇక ముందు ఎవరూ పార్టీని వీడి వెళ్లకుండా చేసేందుకు సిద్ధమయ్యారు.అందుకే ముందుగా అసంతృప్త నేతలను గుర్తించి వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.అది కాకుండా తాను నిర్వహించిన సమావేశానికి కొంతమంది నాయకులు హాజరుకాకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తితో ఉన్నారని బాబు గుర్తించారు.పార్టీకి చెందిన కాపు నాయకులు బోండా ఉమా, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు తదితరులు తెర వెనక ఏదో చేస్తున్నారనే విషయం బాబు దృష్టికి వచ్చింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులైన గంటా శ్రీనివాసరావు, నారాయణ, చినరాజప్పలతో ఇదే విషయమై బాబు చర్చించారట.అసలు పార్టీని వీడడానికి కారణాలు ఏమిటి ? ఎవరెవరికి ఎటువంటి ప్రలోభాలు, ఆఫర్లు వచ్చాయి ? ఎప్పుడు పార్టీ వీడాలనుకుంటున్నారు ? తదితర అంశాల గురించి బాబు చర్చించారట.అసంతృప్తులను ఏదో ఒక రకంగా ఒప్పించి పార్టీని వీడకుండా ఉండేలా చేయాలని భావిస్తున్నాడు.

అందుకే కొంతమంది కీలక నాయకులకు బాబు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం రాజకీయంగా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నా ముందు ముందు అంతా బాగుంటుంది అని, తాను అందరికీ న్యాయం చేస్తానని, ఎవరు పార్టీని వీడొద్దంటూ బాబు రాయబారం నడుపుతున్నారు.అయితే వారంతా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాబు మాట వింటారా అనేది సందేహమే.