జయహో బీసీ : ఉత్తరాంధ్రలో ఊపు వస్తుందా ...?

కులాల అవసరం రాజకీయ పార్టీలకు ఎప్పుడు ఉంటుంది .? ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సమయంలోనే.అందుకే…రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలోనే… వారికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ… వారి మద్దతు పొందేందుకు తీవ్రంగా పనిచేస్తుంటాయి.ఈ విషయంలో ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు రకరకాల పేర్లతో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న బీసీల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

 Chandrababu Naidu Main Aim Is To Get Bc Vote Bank In North Ap-TeluguStop.com

జనసేన, వైసీపీ విషయాలు పక్కనపెడితే టీడీపీకి మొదటి నుంచి బీసీలు అండగా ఉంటూ… వస్తున్నారు.ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా వారే కీలకం అవుతున్నారు.ఒక్క టీడీపీ ఏంటి ఏ పార్టీ అయినా బీసీల మద్దతుతోనే అధికారంలోకి వస్తున్నాయి.

ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే… టీడీపీ కి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు.ఎందుకంటే ఇక్కడ అన్ని కులాలకంటే బీసీ కులస్తులే ఎక్కువ.అందుకే… ఇక్కడ మూడు జిల్లాల్లో మెజారిటీ సీట్లను టీడీపీ గెలుచుకోగలిగింది.తాజాగా టీడీపీ జయహో బీసీ అంటూ….నిర్వహించిన భారీ సభలో ప్రకటించిన వరాలపై బీసీ వర్గాల్లో చర్చ సాగుతోంది.దాన్ని జనంలోకి తీసుకుపోవడంలో టీడీపీ నాయకులు కూడా చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.ప్రతి కులానికి ఓ కార్పోరేషన్ అంటూ చేసిన ప్రకటన కూడా టీడీపీపై సానుకూలమైన ప్రభావం కనిపిస్తోంది.

దీంతో ఇప్పుడు వైసీపీ, జనసేన కూడా ఏదో ఒకరకంగా బీసీల మద్దతు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఇటీవల టీడీపీ నిర్వహించిన జయహో బీసీ ప్రభావం విశాఖ జిల్లాలో గట్టిగానే ఉందని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.ఈ నాలుగు అసెంబ్లీ సీట్లలో గవర సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.విశాఖ పశ్చిమం, పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి అసెంబ్లీ సీట్లలో ఈసారి టీడీపీ, వైసీపీ మధ్యన గట్టి పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఎపుడైతే ప్రత్యేక గవర కార్పోరేషన్ అంటూ టీడీపీ ప్రకటన చేసిందో ఈ వర్గాల్లో మెజారిటీ తమవైపు మళ్ళుతారని టీడీపీ అంచనా వేస్తోంది.అనోకోకుండా టీడీపీకి ఈరెంజ్ లో మద్దతు దక్కడంతో … వైసీపీ ఆందోళన చెందుతోంది.

అందుకే ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పి సానుభూతి పెంచుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.వాస్తవానికి కులానికో ప్రత్యేక కార్పోరేషన్లు అన్న ఆలోచన తమ నవరత్నాల పధకంలో తాము ప్రకటించిన అంశమేనని … దాన్ని టీడీపీ కాపీ కొట్టేసింది అని వైసీపీ గగ్గోలు పెడుతోంది.

అంతే కాకుండా బీసీలకు వైఎస్సార్ చేసిన మేలు ఎవరూ చేయలేదు అంటూ… కొత్త సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారు వైసీపీ నాయకులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube