పవన్ అండకోసం బాబు ఆరాటం..?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు గతంలో ఎప్పుడు చవిచూడలేదు.గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది.

 Chandrababu Naidu Looking For Janasena Chief Pawan Kalyan-TeluguStop.com

ఇక అప్పటి నుంచి టీడీపీకి వరుస కష్టాలు మొదలయ్యాయి.పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అవడం, సీనియర్ నాయకులు రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవడం, యువ నాయకులు బాబు బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా , ఎవరి దారిలో వారు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ బాబుకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

అయినా అవన్నీ దిగమింగుకుని పార్టీ కోసం ఈ వయసులోనూ కష్టపడుతున్నాడు.తాను ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుని వేరొకరికి తన బాధ్యతలు అప్పగిస్తే పార్టీ నామరూపాల్లేకుండా అయిపోతుందని బాధ చంద్రబాబులో కనిపిస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Chandrababu, Chandrababu Tdp, Ycpjagan-Political

ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, తన కొడుకు వయసు ఉన్న వ్యక్తి తనకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి గా ఉండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక అసెంబ్లీలో అయితే అధికార పార్టీ సభ్యులు టిడిపి చంద్రబాబు లోకేష్ గురించి అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నా బాబు తన దుఃఖాన్ని దిగమింగుకుని ఆ సభలో ఇబ్బందికరంగా కూర్చుంటున్నాడు.ఇక ఇప్పుడు ఏపీ శాసనమండలి రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జారిపోయే ప్రమాదం ఉందని బాబు ముందుగానే పసిగట్టాడు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Chandrababu Tdp, Ycpjagan-Political

అందుకే ఈ పరిస్థితుల్లో తనను ఎవరైనా ఆదుకుంటే బాగుంటుంది అనే ఆలోచనకు ఆయన వచ్చాడు.దీనిలో భాగంగానే ఆయన దృష్టి అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పడింది.గతంలో టిడిపితో దోస్తీ చేశారు పవన్.

ఈ పరిస్థితుల్లో టీడీపీ బీజేపీకి దగ్గరయ్యేలా పవన్ మధ్యవర్తిత్వం వహిస్తాడని బాబు ఆశలు పెట్టుకున్నారు.ఈ మేరకు పార్టీకి చెందిన కొంతమంది నాయకులకు పవన్ తో ఈ విషయమై మాట్లాడాల్సిందిగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అయితే పవన్ టిడిపి బాధను అర్థం చేసుకొని బిజెపి దగ్గరకు రాయబారం చేసినా ఫలితం ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది.ఎందుకంటే గతంలో టిడిపి అధికారంలో ఉండగా బిజెపి అగ్ర నాయకులను చంద్రబాబు ఎంత అవమానం చేశాడో తెలిసిందే.

బిజెపి నాయకులు సైతం బాబు చేసిన అవమానాన్ని ఇప్పటికీ మర్చి పోవడం లేదు.

ఏపీ శాసనమండలి రద్దు విషయంలోనూ బీజేపీ హస్తం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

టిడిపిని పూర్తిస్థాయిలో దెబ్బ కొట్టేందుకే మండలి రద్దుకు జగన్ కు సంకేతాలు ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో టిడిపికి అండగా నిలబడాల్సిన అవసరం కానీ అవకాశం ఉందని బీజేపీకి లేదు.

ఈ విషయంలో పవన్ చెప్పినా బిజెపి వినే పరిస్థితి ఉండదు.అయినా బాబు మాత్రం పవన్ టీడీపీని ఆదుకుంటాడనే ఆశతోనే బాబు ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube