అప్పుడలా..!! ఇప్పుడిలా..!!..ఎందుకిలా..బాబు..??

చంద్రబాబు కి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే దిమ్మతిరిగిపోతోంది.ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాలుగు కూడలి మధ్యలో ఉన్న బాబు కి ఎటు వెళ్ళాలో తెలియని అయోమయంలో ఉండిపోయాడు.

 Chandrababu Naidu Letter To Modi On Ap Special Status 2-TeluguStop.com

అందుకే ఏమి చఎఆలో తెలియక ఎదో ఒకటి చేసి జనాల్లో బాబు సూపర్ అని పించికోవాలని తహతహలాడుతున్నాడు.అందులో భాగంగానే శ్వేతపత్రం అంటూ ప్రజల మైండ్ ని డైవర్ట్ చేసే పనిలో పడ్డారు.

అయితే ఎన్నడూ లేనట్లుగా.

చంద్రబాబు నాయుడు పోలవరం పై కూడా శ్వేత పత్రం ఇస్తానని చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది.వివరాలలోకి వెళ్తే.సరిగ్గా నాలుగాన్నరేళ్ళ క్రితం మీడియా ముందుకు వచ్చి రాజధాని లేదని అంటూ ఏకంగా 9 శ్వేత పత్రాలు విడుదల చేశారు.

ఆ తరువాత ఆ సంగతి మరిచిపోయారు.అంతేకాదు ఎవరన్నా శ్వేతపత్రం అడిగితె చాలు ఉగ్ర చంద్రుడి అవతారం ఎత్తేవారు.పోలవరం పై శ్వేత పత్రం గురించి ప్రతిపక్షాలు అడిగినా ,లేక మీడియా అడిగినా సరే కోపంతో ఊగిపోయేవారు, ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తున్నా సరే మీకు ఎందుకు శ్వేత పత్రం అనే చంద్రబాబు ఇప్పుడు తన

రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవసాయం, పారిశ్రామిక ,విద్యుత్ రంగాలలో పురోగతిపై టీడీపీ డెవలప్మెంట్ ఇదీ అనేట్టుగా తపత్రాలు విడుదల చేయబోతున్నారు.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పోలవరంపై బాబు శ్వేతపత్రం ఇస్తానని చెప్పడమే.

అయితే బాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు రీజన్ ఒక్కటే.నాలుగున్నరేళ్ల కిందట విడుదల చేసిన శ్వేతపత్రాల్లో అదేపనిగా కాంగ్రెస్ ను తిట్టారు చంద్రబాబు.

ఆ తర్వాత ఆ పార్టీని తిట్టే అవసరం రాలేదు.అయితే మరొక పార్టీని తిట్టే అవకాశమూ రాలేదు.దాంతో

కాంగ్రెస్ తో అంటకాగుతున్న నేపధ్యంలో బీజేపీపై విరుచుకు పడిపోవడానికి శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.కేంద్రంలో బీజేపీ ఏపీ సర్కార్ పై వివక్ష చూపించిందని, నిధులు ఇవ్వకప్వడం వల్లనే తాము ప్రజలని సరైన వసతులు , ఏపీ అభివృద్ధి చేయలేక పోయామని అయినాసరే మా శాయశక్తులా ఏపీ అభివృద్దికి కృషి చేశామనేది ఆ శ్వేత పత్రాల సారాంశం.అయితే జగన్ ఇదే విషయం గతంలో ప్రస్తావిస్తే బాబు మాత్రం అవన్నీ ఒట్టిమాటలే అని కొట్టి పడేసి ఇప్పుడు వాటినే లేవనెత్తడం బాబు రజకేయానీ పరాకాష్టగా చెప్పచ్చు అంటున్నారు.అయితే ఈ శ్వేత పాత్రాలు 9 కాదు 100 విడుదల చేసినా సరే బాబు ని నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube