తుగ్లక్ పాలన చేస్తున్న జగన్

ఏపీ సీఎం రాజధాని విషయంలో స్పందించిన తీరుపై ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు.ఏపీలో మూడు రాజధానులు ఏర్పడతాయేమో చెప్పలేము అంటూ జగన్ అసెంబ్లీ లో జగన్ చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.

 Chandrababu Naidu Jagan Nara Lokesh-TeluguStop.com

ఈ రోజు రాజధాని అంశంపై అసెంబ్లీ లో వాడివేడిగా చర్చ జరిగింది.అధికార విపక్ష పార్టీలు ఒకరి మీద మరొకరు ఇదే అంశంపై తీవ్రంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో అధికారిక విభజన అనేది మంచి నిర్ణయం, దక్షిణాఫ్రికా తరహాలోనే ఏపీలోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చు అన్నారు.

వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక అందజేయబోతోంది.

దాని ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు జగన్ నిర్ణయం తుగ్లక్ నిర్ణయాలులా ఉన్నాయని, అమరావతిలో ఉన్న సీఎం జగన్, కర్నూలు, విశాఖలకి వెళ్తారా అంటూ బాబు జగన్ పై అసహనం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube