బాబు చెప్పిందే వేదమా ..? జనాలు వెర్రోళ్ళు అనుకుంటున్నారా ..?  

Chandrababu Naidu Is The Ringmaster In Tdp-

చెప్పేవాడికి వినేవాడు లోకువ అని టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఏది చెప్తే అదే జనాలు నమ్మాలి అనే ధోరణిలోనే ఇంకా రాజకీయాలు చేస్తున్నాడు. బాబు చెప్పిందే నిజం అదే అక్షర సత్యం అన్నట్టుగా ఆయన అనుకూల మీడియా కూడా ప్రచారం చేస్తుంది. బాబు ఏది చేసినా అందులో తప్పనిసరిగా స్వప్రయోజనం ఉంటుందని లోకమంతటికి తెలుసు..

బాబు చెప్పిందే వేదమా ..? జనాలు వెర్రోళ్ళు అనుకుంటున్నారా ..? -Chandrababu Naidu Is The Ringmaster In TDP

ఎప్పటికప్పుడు తన ప్రయోజనాలకు అనుగుణంగా మాటలు మార్చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది ఆయనకు కొత్త ఏమీ కాదు. బాబు ముందు నుంచి రెండు కళ్ళ సిద్దాంతమే ఫాలౌ అవుతున్నాడు.

అవకాశవాద రాజకీయాలు చేయడం బాబు కి వెన్నతో పెట్టిన విద్య అనే ప్రచారంలో నిజం లేకపోలేదు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడిన టీడీపీ అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మెజార్టీ టీడీపీ నాయకులు సహించలేకపోతున్నారు.

అలాగే మొన్నటివరకు కేంద్ర అధికార పార్టీ బీజేపీ తో అంటకాగి ఇప్పడు ఆ పార్టీ మీద ఒంటికాలిపై లేస్తున్నాడు. రెండేళ్ల కిందట నోట్ల రద్దు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడో అందరికీ తెలిసిందే.

అది అద్భుతమైన చర్య అని, నోట్ల రద్దు గొప్ప పని, మోడీ అలాంటి పని చేశాడని, మోడీ ఆ పని చేయడం వెనుక తనే ఉన్నాను అని.తన సలహా మేరకే మోడీ మారకంలోని నోట్లను రద్దు చేశాడని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు..

అది అప్పటి మాట. ఆ తరువాత ప్లేట్ మార్చేశాడు.నోట్ల రద్దు పనికిమాలిన చర్యగా అభివర్ణించాడు బాబు.

ఇప్పుడేమో నోట్ల రద్దు తో ప్రయోజనం లేదని, మోడీ సమర్థుడు కాదని, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడని చంద్రబాబు చెబుతున్నాడు.

ఇక తిత్లీ తుఫాన్ విషయంలో కేంద్రం సరిగా సాయం చేయలేదని కూడా చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి వెనుకటికి హుదూద్ తుఫాన్ విలయం అప్పుడు కేంద్రం నామమాత్రంగానే సాయం చేసింది. అయితే చంద్రబాబు అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ లేదు.

ఇప్పుడు బీజేపీతో పడటం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఇలా ఒకటి కాదు ప్రతి విషయంలోనూ రెండు విభిన్న స్వరాలు వినిపించడం బాబు కే చెల్లింది. ఇక జనసేన విషయంలోనూ బాబు అదే సిద్ధాంతం కొనసాగిస్తున్నాడు..

పవన్ అంత గొప్ప వ్యక్తి లేరని , ఆయన అవసరం రాష్ట్రానికి చాలా ఉందని చెప్పిన బాబు ఆ తరువాత ఆయనతో పొత్తు వ్యవహారం బెడిసికొట్టడంతో పార్టీ నాయకులతో విమర్శలు చేషిస్తున్నాడు. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణమే అయినా బాబు మాటలు మాత్రం కొంచెం ఓవర్ గానే కనిపిస్తుంటాయి. ఇవన్నీ జనాలు పట్టించుకోవడంలేదు అంటే పొరపాటే.