ఆ తప్పు తో బాబుకు ముప్పు ! కొరివితో తలగోక్కోవడం అంటే ఇదేనేమో !

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.నలువైపులా నుంచి ఆయనకు శత్రువుల దాడి ఎక్కువయ్యింది.

 Chandrababu Naidu In Deep Trouble With The Kcr-TeluguStop.com

క పక్క వైసీపీ అధినేత జగన్ రోజు రోజుకి బలం పెంచుకుని ప్రజల్లో పలుకుబడి పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.అలాగే జనసేన పార్టీ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది.

ఈ రెండు పార్టీల హవతోనే టీడీపీ సతమతం అవుతుంటే ఇప్పుడు కొత్త శత్రువు తయారయ్యి వీరందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నాడు.ఇతడు బలమైన శత్రువు కావడంతో కక్కలేక మింగలేక అన్నట్టు తయారయ్యింది బాబు పరిస్థితి.

దీనంతటికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే… ఇదంతా బాబు స్వయంగా చేసుకున్న స్వయంకృపరాధమే అని అర్ధం అవుతుంది.సాధారణ ఎన్నికల సమయానికి సమయం ముంచుకొస్తున్న తరుణంలో ఇటువంటి పరిణామాలు పుండు మీద కారం చల్లినట్టుగా… కనిపిస్తోంది.

అసలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల మీద దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం చంద్రబాబే.మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేసాడో … అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ రాజకీయాల్లో కెసిఆర్ చురుగ్గా స్పందించడం మొదలు పెట్టారు.అది ఏ స్థాయిలో అంటే ఎపి లోని ఇతర రాజకీయ పక్షాలకన్నా ఇప్పుడు కెసిఆర్ ప్రధాన పక్షంగా చంద్రబాబు అండ్ టీం భావించే స్థాయిలో.దాంతో టిడిపి కి నిత్యం తెలంగాణ నేతల నుంచి తలపోట్లు వచ్చే ఎన్నికల వరకు తప్పేలా కనిపించడం లేదు.

సొంత రాష్ట్రంలో టీడీపీ వ్యతిరేక పార్టీలన్నిటిని సమర్ధవంతంగా… ఎదుర్కోగలుగుతున్నా … కేసీఆర్ ఎదురుదాడి ని మాత్రం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారు.

తెలంగాణాలో ఎన్నికలు పూర్తి అవ్వడంతో… ఇప్పుడు కేసీఆర్ దృష్టి అంతా తన ప్రధాన శత్రువు చంద్రబాబుకి అధికారం దక్కకుండా చేయడమే.ఎందుకంటే ఆయన ఇక్కడ ఓటమి చెందితే… జాతీయ రాజకీయాల్లోకి రావడానికి బాబు పెద్ద అడ్డంకి ఏర్పడుతుంది.దీంతో పాటు తెలంగాణలోనూ టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది.

ఇదే ప్లాన్ తో కేసీఆర్ ఇప్పుడు టీడీపీ మీద టార్గెట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.అదీ కాకుండా ఏపీలో ఇప్పుడు టీడీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి.

ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించిన బీజేపీ… జనసేన పార్టీలు ఇప్పడు టీడీపీకి దూరం అయ్యి ఓడించేందుకు పావులుకదుపుతున్నాయి.వీరందరికంటే ప్రధానమైన శత్రువు కేసీఆర్ బాబు కి వ్యతిరేకంగా మారడానికి కేవలం బాబు స్వీయ అపరాధమే కారణంగా కనిపిస్తోంది.

కేసీఆర్ ఎంత తీవ్ర స్థాయిలో బాబు ని విమర్శించినా.గట్టిగా ఎదురుదాడి చేయలేని పరిస్థితి బాబుది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube