చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రినీ ప‌క్క‌న పెట్టేస్తారా..?

ఒక‌ప్పుడు చురుగ్గా ప‌నిచేసిన వారు చాలామంది టీడీపీ నేత‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు.దీంతో పార్టీ కూడా చాలా వెన‌క‌బ‌డిపోయింది.

 Chandrababu Naidu Ignoring Tdp Leaders, Tdp Leaders, Chandrababu Naidu, Pulivart-TeluguStop.com

అటు త‌మ్ముళ్లు కూడా కొంద‌రి ప‌ని తీరు ప‌ట్ల చాలా అసంతృప్తిగా ఉంటున్నారు.దీంతో వ‌రుస ఎన్నిక‌ల్లో ఓట‌మి కూడా చ‌విచూడాల్సి వచ్చింది.

దీంతో చంద్ర‌బాబు దృష్టికి కూడా చాలామంది మీద ఫిర్యాదులు అందాయి.అయినా స‌రే వారిని ఎవ‌రినీ దూరం చేసుకోలేని ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఉంటున్నారు.

కాగా ఎప్పుడైతే కుప్పం ఎన్నిక‌ల్లో కూడా ఓడిపోతూ వ‌స్తున్నారో అప్ప‌టి నుంచే పార్టీ నాయ‌కుల‌పై ఫోక‌స్ పెట్టారు.

దీంతో ఇప్పుడు పార్టీలో ప్రక్షాళ‌న చేయాల‌ని డిసైడ్ అయిపోయారు.

మండ‌ల స్థాయి నుంచే ఈ ప్రక్షాళ‌న జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నారు.గ‌తంలో లేని విధంగా పార్లమెంట్ అధ్యక్షులను కూడా నియ‌మించారంటే ఏ విధంగా చంద్ర‌బాబు ప్లాన్ వేసుకుంటున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కాగా ఇప్పుడు వారి తీరులో కూడా అనేక మార్పులు వ‌స్తున్నాయి.దీంతో వారి మీద కూడా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.

వారిలో చాలామంది పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ గా లేర‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా చిత్తూరులో ఇలాంటి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.

చిత్తూరు పార్ల‌మెంట్ అధ్య‌క్షులు పులివర్తి నాని, అలాగే తిరుపతి పార్ల‌మెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఈ మ‌ధ్య పెద్ద‌గా యాక్టివ్ గా ప‌నిచేయ‌ట్లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.నిజానికి చిత్తూరు అంటేనే వైసీపీకి కంచుకోట‌. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత చురుగ్గా ప‌నిచేయాల్సింది పోయి.ఈ ఇద్ద‌రు మాత్రం అంత‌గా ప‌నిచేయ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌ను ధీటుగా తిప్పికొట్ట‌లేక‌పోతున్నార‌ని, పైగా పార్టీ ఏ పిలుపు ఇచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ల‌ట్లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.దీంతో ఈ ఇద్ద‌రిని త్వ‌ర‌లోనే బాబు ప‌క్క‌న పెట్టేస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

చూడాలి మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube