గెలుపు పై బాబు కే డౌట్ వచ్చిందా ...?

గెలుపు ధీమాగా ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ… కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తూ… ముందుకు దూసుకువెళ్తోంది.ఇప్పటివరకు ప్రజావ్యతిరేకత ప్రభుత్వం పై ఎలా ఉన్నా….

 Chandrababu Naidu Have Doubt About Winning In 2019-TeluguStop.com

ఇక ఈ మూడు నెలల్లో మాత్రం పెరగకుండా .తగ్గించాలని చూస్తోంది.ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాకర్షక పథకాలను ప్రకటించి టీడీపీ ఇమేజ్ పెంచుకుంది.ఇక నాయకుల వ్యవహారశైలిపై అనేక విమర్శలు చెలరేగుతుండడం… ఆ ఎఫెక్ట్ పార్టీ మీద పడుతుండడంతో….

బాబు అప్రమత్తం అయ్యాడు.అందుకే కిందిస్థాయి నాయకుల వ్యవహారశైలిని మార్చాలనే ఉద్దేశంతో వారికి అనేక సూచనలు ఇస్తూ… ప్రజల్లో పరపతి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇంతవరకు పార్టీ పరిస్థితి మెరుగవుతున్నట్టు కనిపిస్తున్నా… సిట్టింగ్ ఎమ్యెల్యేల వ్యవహారం బాబు ని కలవరపెడుతోంది.ఇప్పటికే అంతర్గతంగా అనేక సర్వేలు పూర్తి చేయించిన బాబు ఆ రిపోర్ట్స్ చూసి మరింత కలవరం చెందుతున్నాడు.దీనికి తోడు ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తోడవ్వడంతో….సిట్టింగ్ ఎమ్యెల్యేల టికెట్ల విషయంలో ఏం చేయాలో పాలుపోనీ పరిస్థితుల్లో బాబు ఉన్నాడు.టీడీపీ కి చెందిన నూటా నాలుగు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మెజారిటీ మందిపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని తేలినట్టుగా తెలుస్తోంది.ఏకంగా డెబ్బై మంది సిట్టింగులు మళ్లీ గెలవడం కష్టం అనే అంచనాలకు వచ్చాడట చంద్రబాబు నాయుడు! ఇదీ పరిస్థితి

మరోవైపు చూస్తే….

ఇక ఏపీలో టీడీపీ పని అయిపొయింది అంటూ… జాతీయ స్థాయి లో అనేక సర్వేలు చెబుతున్నాయి.టైమ్స్ నౌ సర్వేలో అయితే తెలుగుదేశం పార్టీ కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రం నెగ్గగలదని అంచనా వేసింది.

మరి కొన్ని సర్వేలు మాత్రం తెలుగుదేశం పార్టీ పరిస్థితి కొద్దో గొప్పో బాగుందని అంటున్నాయి.చంద్రబాబు సర్వేలో మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలవగలిగే సిట్టింగుల సంఖ్య ముప్పై నాలుగు మాత్రమే అని స్పష్టమైందని సమాచారం.

ఇక ఫిరాయింపుదారులపై చంద్రబాబుకే నమ్మకం లేదు.వాళ్లను ప్రజలు కసిగట్టి ఓడించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఏ రకంగా చూసినా.తెలుగుదేశం పార్టీ యాభైకి మించి సీట్లను సాధించలేదని చంద్రబాబు నాయుడి సొంత సర్వేల్లోనే తేలినట్టుగా తెలుస్తోంది.అందుకే ఏదో విధంగా వ్యతిరేక గాలిని తగ్గించుకుని మరోసారి అధికారం చేపట్టేలా బాబు కొత్త ఎత్తుగడలు వేయడంలో బిజీ అయిపోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube