ఆ స్థానాల్లో టీడీపీ లో క్లారిటీ వచ్చేసినట్టేనా ?  

Chandrababu Naidu Have Clarity On Particular Candidates-murali Movhan,tdp,tdp Candidates Second List

 • టీడీపీ ఎంపీ సీట్ల విషయంలో ఇప్పటివరకు ఆయా స్థానాల్లో సరైన అభ్యర్థులు ఎవరనేది స్పష్టమైన క్లారిటీ దొరకలేదు. టీడీపీ సిట్టింగ్ ఎంపీలంతా ఈసారి అసంబ్లీకి వెళ్లేందుకు, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుండడంతో పార్టీలో ఈ పరిస్థితి తలెత్తింది.

 • ఆ స్థానాల్లో టీడీపీ లో క్లారిటీ వచ్చేసినట్టేనా ? -Chandrababu Naidu Have Clarity On Particular Candidates

 • దీంతో కొత్త అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీడీపీ చాలానే కష్టపడాల్సి వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లేందుకే అంతా మొగ్గుచూపుతున్నారు.

 • దీని కారణంగానే పార్లమెంట్ కి పోటీ చేసే అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పడు ఆ విషయంలో టీడీపీకి చింత తీరినట్టయ్యింది.

 • అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కిరావడంతో ఆ లిస్ట్ ప్రకటించాలని చూసారు. అయితే మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మరణంతో ఆ ప్రకటన కాస్తా వాయిదా వేశారు.

 • Chandrababu Naidu Have Clarity On Particular Candidates-Murali Movhan Tdp Tdp Candidates Second List

  ఈ రోజు తిరుపతిలో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అందులో ఉండే పేర్లు ఈ విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావు, నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, రాజమహేంద్రవరం నుంచి మాగంటి రూప పేర్లు తిరుపతి నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మితోపాటు తాజాగా పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పేరు ప్రస్తావనకు వచ్చినా ఆఖరికి పనబాకకే టికెట్‌ ఫిక్స్ చేశారట.

 • రామాంజనేయులును కర్నూలు జిల్లా కోడుమూరు శాసనసభ కు పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు అయితే అక్కడ లోక్‌సభ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆయన రాకను వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ససేమీరా అన్న మంత్రి శిద్దా రాఘవరావు చివరికి పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు.

 • Chandrababu Naidu Have Clarity On Particular Candidates-Murali Movhan Tdp Tdp Candidates Second List

  మొదటి నుంచి నెల్లూరు అభ్యర్థిగా ప్రచారం జరిగిన బీద మస్తాన్ రావు కే ఆ సీటు కన్ఫర్మ్ చేశారట.రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ ఈ సరి ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించడంతో ఆయన కోడలు స్వరూపాదేవి పేరు ఖరారు చేశారట.ముందుగా ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, వ్యాపారవేత్త మూర్తి తదితరుల పేర్లు ప్రచారం జరిగినా చివరకి స్వరూపాదేవికే సీటు దక్కింది.

 • నంద్యాల లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు శివానందరెడ్డి కూడా ఆశిస్తున్నారు. టీడీపీ కూడా శివానందం రెడ్డివైపే మొగ్గుచూపుతున్నారు.

 • విశాఖ నుంచి గాజువాక పల్లా శ్రీనివాస్, ముళ్ళపూడి రెండుగా పేర్లు వినిపిస్తున్నాయి. అమలాపురానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీష్‌ మాథుర్‌, మాజీ ఎంపీ హర్షకుమార్‌లలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.