మోడీ విమర్శలతో బాబు ఖుషీ..!

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు అందరికి తెలిసినవే.జగన్ , బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఒకవైపు ఉంటే సింహం సింగిల్ గా నిలిచుంది అన్నట్టుగా బాబు ఒక వైపు ఉన్నారు.

 Chandrababu Naidu Happy With The Narendra Modi Comments-TeluguStop.com

ఆ మూడు పార్టీలు టీడీపీ ని ,అధినేత చంద్రబాబు ని సమయం వచ్చినప్పుడల్లా ఏకి పారేస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ పరిణామాలే బాబుకి బాగా కలిసి వచ్చేస్తున్నాయి.

అలా ఇలా కాదంట.ఏపీలో బాబు కి సానుభూతి తెప్పించడంలో ఈ ముగ్గురు ఎంతో కష్టపడుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలాఉంటే ఈ ముగ్గురిలో ముఖ్యంగా

మోడీ చంద్రబాబుపై పగబట్టిన తాచు లాగా శ్రుతిమించి విమర్శలు చేయడం.అందుకు అనుగుణంగా వైసీపీ ,జనసేన పార్టీలు తానా అంటే తందానా అనడం బాబు కి కలిసోస్తున్న అంశాలు అంటున్నారు విశ్లేషకులు.ఇదేంటి మోడీ విమర్శలు చేస్తే ఏపీ సీఎం చంద్రబాబు కి ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారా.దానికి ఓ లెక్క ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఆలెక్కలు ఏమిటంటే.

2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే చంద్రబాబును ఓడించి తీరాలని శపధం పూనిన బీజేపీ నాయకులు బాబు పై ఎంతో యాంటీ ప్రచారం చేశారు ,చేస్తున్నారు కూడా.అయితే ఈ ప్రచారం బాబుకు పాజిటివ్ గా మారుతోందట.ఎలా అంటే ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు.ఉన్నా కేవలం రెండు లేదా మూడు సీట్లకే పరిమితం అవుతోంది.అయితే ఈ క్రమంలో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బాబు ని చెడామడా తిట్టేస్తూ వార్తల్లో నిలవాలని ప్లాన్లు వేస్తున్న బీజేపీకి సీట్లు ,ఓట్లు రావడం పక్కన పెడితే బాబు పై సానుభూతి మాత్రం భారీగా తెప్పిస్తోంది.

అందుకు కారణం చంద్రబాబు పై వీలు కుదిరిన కుదరకపోయినా సరే ఎదో ఒక రూపంలో దుమ్మేత్తిపోయడమేనట.

అయితే ఇక్కడే ఓ చిన్న లాజిక్ బీజేపీ మర్చి పోయింది.ఏపీలో బాబు సీఎం గా ఉన్నారు అంటే చంద్రబాబు ని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నట్టే.కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కి ఏపీలో బలమైన ఓటు బ్యాంకు ఉంటేనే ఇలాంటి ఎత్తుగడ వేయాలి కాని ఏమీ లేకుండానే బాబు పై ఎదురు దాడి చేయడం వలన ఉపయోగం లేదనేది రాజకీయ పండితుల వాదన.

పోలవరం మొదలు రాజధాని వరకూ మోడీ సహకరించక పోయినా సరే, బాబు తన అనుభవంతో నెట్టుకొచ్చారని ,ప్రతీ జిల్లాలో అభివృద్ధి కనిపిస్తోందని ప్రజలు ఈ విషయాలని నిశితంగా పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.ఈ క్రమంలో ఏపీకి ఏమి చేయని ప్రధాని మా సీఎం ని అంటే ఊరుకుంటామా అనే పరిస్థితికి వెళ్ళిపోయారు దాంతో ఇప్పుడు మోడీ చేస్తున్న విమర్సలకి గుర్రుగా ఉన్న ఏపీ ప్రజలు బాబు కి మద్దతుగా నిలుస్తున్నారని.

బాబుపై ఎంతో కొంత అసంతృప్తిగా ఉన్న ప్రజలు సైతం మోడీ వ్యాఖ్యలతో యూ టర్న్ తీసుకుంటున్నారని అంటున్నారు.ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కి కలిసొస్తాయనేది పరిశీలకుల విశ్లేషణ.

ఇక్కడ కట్ చేసి వాస్తవ పరిస్థితిలోకి వస్తే.ఏపీలో పోలవరం నుంచి రాజధాని వరకు, సంక్షేమ పథకాల నుంచి పించన్ల వరకు, విదేశీ విద్య నుంచి ఇంటి నిర్మాణాల వరకు కూడా ప్రతి జిల్లాలోనూ ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తోంది.

దీనిని ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారు.మరోపక్క, చంద్రబాబు చేస్తున్న ప్రచారం కూడా జోరందుకుంది.కేంద్రం ఇస్తున్నది ఏమీ లేకపోయినా.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నానని చెబుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు బలంగానే ప్రజల్లోకి వెళ్తున్నాయి.

మరోపక్క, కేంద్రంలోని నరేంద్రమోడీ ఏపీని మోసం చేస్తున్నారని, ప్రత్యేక హోదా ఇస్తానంటేనే నేనే ఆయనకు మద్దతిచ్చానని, ప్యాకేజీ కూడా ఇవ్వనందుకే నేను బయటకు వచ్చానని చెప్పుకోవడంలోనూ బాబు సక్సెస్ అయ్యారు.మరోపక్క, చంద్రబాబు అవినీతి చేస్తున్నారన్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలు కూడా ప్రజల్లో వెళ్లడం లేదు.

పైగా ఎవరూ పట్టించుకున్న సందర్భాలు కూడా కనిపించడం లేదు.దీంతో మోడీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు జోక్‌గా తీసుకుంటున్నారే తప్ప సీరియస్‌గా దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.

దీంతో మోడీ ప్రచారం మొత్తంగా బాబుకు సానుకూలంగా మారుతుందే తప్ప.మైనస్ లేదని విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube