టిడిపి పొలిట్ బ్యూరోలోకి జూనియర్ ఎన్టీఆర్ ?  

Chandrababu Naidu Give The Tdp Politbureau Member To NTR - Telugu Chandrababu Latest Update, Chandrababu Naidu, , Chandrababu Naidu Son Lokesh Babu, Lokesh Babu In Tdp, Tdp Ap, Tdp Chief Chandrababu Naidu, Ycp

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మరోసారి ఏపీ రాజకీయాల్లో తెరపైకి వచ్చింది.చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని, యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటారని, కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని గట్టెక్కిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Chandrababu Naidu Give The Tdp Politbureau Member To Ntr

అయినా జూనియర్ ఎన్టీఆర్ అవేవి పట్టించుకోకుండా సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలు నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం టీడీపీ కీలక నాయకులందరినీ టార్గెట్ చేసుకుంటూ అటు కేంద్రం, ఇటు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులూ బెంబేలెత్తిపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడడం తదితర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలోని సీనియర్ నాయకులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ను టిడిపిలో యాక్టివ్ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని అధినేత చంద్రబాబు దగ్గర వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.చంద్రబాబు ప్రస్తుతం వయసు రీత్యా చూసుకున్నా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం మరెంతో దూరంలో లేదు.ఈ లోపు తన కుమారుడు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగిద్దామా అంటే అతని సమర్థతపై పార్టీ నాయకులు ఎవరికి నమ్మకం లేదు.ఈ పరిణామాల నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే పార్టీని గట్టెక్కించే సామర్ధ్యం ఉన్నవాడు అనే భావన చంద్రబాబు లోనూ వచ్చినట్లుగా తెలుస్తోంది.

అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పొలిట్ బ్యూరో లో చోటు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.అంతేకాకుండా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.దీని ద్వారా తమకు నిత్యం ఇబ్బందికరంగా మారి టీడీపీ పై విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి కొడాలి నాని దూకుడుకు కళ్లెం వేయడంతో పాటు నిస్తేజంలో ఉన్న పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహం తీసుకురావచ్చని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.ఇదే నిజమైతే టిడిపికి తిరిగి పునర్వైభవం రావడం ఖాయం.

#YCP #TDP AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chandrababu Naidu Give The Tdp Politbureau Member To Ntr Related Telugu News,Photos/Pics,Images..