ఎన్టీఆర్ కు వెన్నుపోటు చంద్రబాబు క్లారిటీ

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అన్యాయంగా, అక్రమంగా తెలుగుదేశం పార్టీని లాక్కుని, నీచ రాజకీయాలకు చంద్రబాబు పాల్పడ్డారని, నందమూరి వారసులను డమ్మీలు చేసి వారిని రాజకీయంగా వాడుకుంటున్నారని, చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరూ ఉండరు అంటూ ఎప్పటి నుంచో ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయితే ఈ విమర్శలపై ఎప్పుడు చంద్రబాబు నోరు విప్పేందుకు ఇష్టపడకుండా మౌనంగా వాటిని భరిస్తూ వస్తున్నారు.

 Chandrababu Naidu Give The Clarity About Father In Law Ntr-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు అంటూ పదే పదే మంత్రులు చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.

Telugu Chandrababu, Chandrababu Ntr, Chandrababugive, Tdp Chandrababu, Ycpjagan-

ఈమధ్య ఈ తరహా ర్యాగింగ్ ఎక్కువవడంతో చంద్రబాబు తాజాగా దీనిపై స్పందించారు.మండలి రద్దు కు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన మామకు వెన్నుపోటు అంశంపై స్పందించారు.మా మామకు వెన్నుపోటు పొడిచానని జగన్ నన్ను పదే పదే అంటున్నారని, కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పాటు, భావితరాలకు తెలుగుదేశం పార్టీని అందించాలనే బలమైన నిర్ణయంతోనే పార్టీని నా చేతుల్లోకి తీసుకున్నాను అని, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ తమ నాయకుడిగా ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాము అంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు బాబు.

Telugu Chandrababu, Chandrababu Ntr, Chandrababugive, Tdp Chandrababu, Ycpjagan-

మారిన పరిస్థితుల కారణంగా తాము సిద్ధాంతాలు మార్చుకున్నాము తప్ప మాట మార్చలేదు అని అన్నారు.గతంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారని, వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత మండలిని పునరుద్ధరిస్తారు అంటే వద్దని అడ్డుకున్నది నిజమేనంటూ బాబు చెప్పారు.ఆ తర్వాత ప్రజల డిమాండ్ ప్రకారమే కొనసాగించమని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube