ప్రపంచాన్ని జయించి పాలించే రాజుకి కూడా ఇంట్లో పోరు తప్పదేమో..ఒక రకంగా చెప్పాలంటే ఏ పోరు ఉన్నా పరవాలేదు కానీ ఇంట్లో పోరు మాత్రం ఎవరికీ ఉండకూడదు అంటారు ఈ విషయంలో ఎవరూ అతీతులు కాదు అని నిరూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ టాక్ జోరుగా వినిపిస్తోంది..దేశంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్ లో ఒకరుగా పేరున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎంతో శ్రమిస్తున్నారు ఈ క్రమంలోనే బాబు కి పోటీగా జగన్ ,జనసేన లు కూడా పోటీగా నిలుస్తుండటంతో చంద్రబాబు పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతోంది..
ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి మరో మరు అధికారం ఎలా చేజిక్కించుకోవాలి అనే ఆలోచనలో బాబు బిజీ బిజీగా గడుపుతూ ఉంటే బాబు గారి తనయుడు మాత్రం టీడీపీ ని పుట్టి ముంచే పనిలో పడ్డాడు అనేట్టుగా ఉంది పరిస్థితి అంటున్నారు టీడీపీ నేతలు..ఇంతకీ లోకేష్ వలన పార్టీకి కలిగే పమాదం ఏముందనే వివరాలలోకి వెళ్తే..
ముఖ్యమంత్రి తనయుడిగా లోకేష్ కి ఎమ్మెల్సీ అదే సమయంలో ఐటీ శాఖని కట్టబెట్టిన బాబు ఆ తరువాత సమయంలో లోకేష్ తీరు పార్టీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో తెలుసుకోలేక పోయారు..
ముఖ్యంగా లోకేష్ తీరుతో ప్రధానంగా ఉపముఖ్యమంత్రి కె.ఇ. క్రష్ణమూర్తి – ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు – విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసు వంటి వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని టాక్ వినిపిస్తోంది..ఈ నేతలు లోకేష్ పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. లోకేష్ విషయంలో కక్కలేక మౌనంగా ఉన్న నాయకులకు పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మంచి బలాన్నిచ్చాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ని ఏపీ సీఎం తనయుడు లోకేష్ లని పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు…
ఆ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే..దాంతో పవన్ వ్యాఖ్యతో టీడీపీలో లోకేష్ వల్ల ఇబ్బందులు పడుతున్న సీనియర్స్ కి మాంచి ఊతం దొరికినట్టు అయ్యింది..పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని లోకేష్ పై వారు బాణాలను ఎక్కుపెట్టేందుకు సన్నద్దమవుతున్నట్టు సమాచారం. తాను భీమిలిలో గెలవనని ఓ పత్రికలో సర్వే పేరుతో ప్రచారం చేయించింది లోకేష్ అని గంటా పలువురు సన్నిహితుల తో కూడా అన్నట్లుగా తెలుస్తోంది..అయితే పవన కి గంటాకీ మధ్య సాన్నిహిత్యం ఉండటంతో గంటా వ్యాఖ్యల వెనుకాల పవన్ ఉన్నాడని టాక్ కూడా వచ్చింది..
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి యనమల కూడా లోకేష్ పై బాబు కి ఫిర్యాదు చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది..తన శాఖ అధికారులతో లోకేష్ డైరెక్ట్ గా మాట్లాడటమే కాకుండా నేరుగా తనకి తెలియకుండానే పనులు చేయించుకుంటున్నారు అనే టాక్ కూడా వచ్చింది..ఈ తరుణంలో బాబు తో తెగేసి చెప్పలేక ఇటు పార్టీలో ఉండలేక సతమత మవుతున్న వారు త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది..ఇప్పటికైనా లోకేష్ ని కంట్రోల్ లో పెట్టకపోతే పార్టీ తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు..