అటు జేసి ఇటు పరిటాల..ఇరుక్కుపోయిన బాబు  

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేది. అధినేత చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అయితే అదంతా గతంలోనే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టీడీపీలో వలసలు నాయకుల హవా ఎక్కువ అవ్వడంతో చంద్రబాబు మాట వినేవారు కనిపించడంలేదు. అంతా తమ ఇష్టం మా మాట వినకపోతే మీకే నష్టం అన్నట్టుగా నాయకుల పరిస్థితి తయారయ్యింది. అసలే ఇప్పుడు వస్తుంది ఎన్నికల సీజన్ ఇంకా మాములుగా ఊరుకుంటారా ..? తమ డిమాండ్లు అన్ని అధినేత ఉండు ఉంచి చేస్తే సరి లేకపోతే మా సత్తా చూపిస్తాం అనే రేంజ్ లో ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు.

Chandrababu Naidu Getting Blackmailing In Anantapur District-

Chandrababu Naidu Getting Blackmailing In Anantapur District

టీడీపీ కి మంచి పట్టు ఉన్న అనంతపురం జిల్లాలో పరిస్థితి అదుపుతప్పింది. పరిటాల సునీత కొడుకు కూడా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన దందాలు, దాడులపైన కూడా ఆరోపణలు, తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక జేసీ బ్రదర్స్ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా ఎక్కువ సీట్లు తమ వర్గానికే కేటాయించాలని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం కంటే ముందు కూడా జేసీ చాలా సార్లు చంద్రబాబును ఓ స్థాయిలో డిమాండ్ చేశాడని టిడిపి నేతలే చెప్తున్నారు.

నేను చెప్పిన వారికే సీట్లు కేటాయించకపోతే టీడీపీ ఇక్కడ గెలవడం కష్టం కనీసం మూడు స్థానాలు లోపే వస్తాయి అంటూ జేసీ ఫైర్ అవుతున్నారు. అప్పనంగా వైఎస్ జగన్‌కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనుకుంటే చంద్రబాబు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చని జేసి తనదైన స్టయిల్లో హెచ్చరికలు పంపుతున్నాడు. జేసి అంటే బాబు కి భయమే ఎందుకంటే ఆయనకు కోపం వస్తే వారు వీరు అని కూడా చూడడు తిట్ల పురాణం అందుకుంటాడు.

Chandrababu Naidu Getting Blackmailing In Anantapur District-

ఇక అయన విషయం పక్కనపెడితే … అనంతపురం జిల్లాలో మరో కీలకమైన పరిటాల ఫ్యామిలీ కూడా ఇప్పుడు తమ డిమాండ్లు వినిపిస్తోంది. పరిటాల సునీతతో పాటు ఆమె కుమారుడు శ్రీరామ్ కూడా వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ వర్గ జనాలకు కూడా ఒక టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్లు తాము చెప్పిన వాళ్ళకు ఇస్తేనే అనుచరుల సపోర్ట్ ఉంటుందని, తాము ఆయా అభ్యర్థులను గెలిపిస్తామని లేకపోతే టిడిపి ఓటమి బాధ్యత మా పైన నెట్టవద్దని ఇరు వర్గాలు కూడా చెప్పేస్తున్నాయి. జిల్లాలో కీలకమైన ఈ రెండు వర్గాలు ఇలా ముక్కుసూటిగా తమ డిమాండ్లు చెప్పేస్తుండడంతో బాబులో ఒకటే ఆందోళన కనిపిస్తోంది. ఇస్తే ఒక తంటా ఇవ్వకపోతే ఒక తంటా ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గుకురావాలో తెలియక బాబు సతమతం అయిపోతున్నాడు.