చినబాబు ఇక్కడి నుంచి ... పెదబాబు అక్కడి నుంచి !  

  • ఏపీలో రాజకీయ వేడి మొదలయ్యింది. టికెట్ల కోసం చంద్రబాబు ని ప్రసన్నం చేసుకుని తమ జాతకం మార్చుకోవాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే వారి సంగతి ప్రస్తుతానికి పక్కనపెడితే… ఇప్పుడు చంద్రబాబు దృష్టంతా తన కుమారుడు లోకేష్ బాబు మీద పెట్టాడు. లోకేష్ కి ఇప్పటికే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం తో పాటు బాబు తరువాత లోకేష్ అనే విధంగా చినబాబు పరపతి పెంచగలిగాడు. అయితే… లోకేష్ మాత్రం ఇంకా రాజకీయ మెచ్యూరిటీ పూర్తిస్థాయిలో తెచ్చుకోలేదన్నది అందరూ ఒప్పుకునే నిజం.

  • Chandrababu Naidu From Tirupati With Nara Lokesh Kuppam-

    Chandrababu Naidu From Tirupati With Nara Lokesh From Kuppam

  • లోకేష్ మీద ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఆయన దొడ్డిదారిన మంత్రి అయ్యారని వైసీపీనాయకులు అంటే పంచాయతీ ఎన్నికల్లోనూ గెలిచే సత్తాలేని నాయకుడు మనకు మంత్రి అయ్యారని పవన్ కళ్యాణ్‌ విమర్శించారు. విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఇదే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను గెలిపించిన తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది చంద్రబాబు ఇప్పటికే గ్రహించారు. అయితే, ఆయనను గెలిపించడం సాధ్యమా? అనేదే ఇప్పుడు ప్రశ్న. అందుకే ఆయన కోసం టీడీపీ కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాలపై బాబు దృష్టిపెట్టాడు.

  • Chandrababu Naidu From Tirupati With Nara Lokesh Kuppam-
  • మొదట్లో హిందూపురం సీటు ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఇక్కడ బాబు వియ్యంకు డు బాలకృష్ణ తనదైన శైలిలో తిష్టవేశారు. తను, తన భార్య ఓట్లను కూడా అక్కడికి మార్పించుకున్నారు. దీంతో బాబు ఆ నియోజకవర్గంలో వేలు పెట్టకూడదనే ఆలోచనలో ఉన్నారు. అందుకే తాను కంచుకోటగా మలుచుకున్న కుప్పం నియోజకవర్గాన్ని లోకేష్ కి కేటాయించాలని బాబు చూస్తున్నాడట. ఇక తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మపై ఫిర్యాదులు వెల్లువెత్తడం, ఇక్కడ జనసేన నుంచి చదలవాడ కృష్ణమూర్తి పోటీ పడుతున్న నేపథ్యంలో తాను తిరుపతి నుంచి పోటీ చేయాలని బాబు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.